టాప్ ఫ్రెండ్‌షిప్ మూవీస్..టాలీవుడ్‌లో ఇవే బెస్ట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో కూడా స్నేహం వాల్యూని చాలా బాగా చూపించారు.

Update: 2026-05-29 00:30 GMT

జీవితంలో ఎన్నో బంధాలు పుట్టుకతోనే వస్తే.. మనకు నచ్చినట్టుగా మనం ఎంచుకునే ఏకైక అందమైన బంధం 'స్నేహం' మాత్రమే అన్నది నిజం. స్కూల్ డేస్ లో చాక్లెట్ ముక్కను పంచుకోవడం దగ్గరి నుంచి.. కాలేజీ లో క్లాస్ బంక్ కొట్టి బైక్‌లపై తిరగడం వరకు ప్రతి జ్ఞాపకంలోనూ దోస్తే నెంబర్ వన్. ఈ ఎమోషన్‌ను టాలీవుడ్ ఎప్పుడూ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తూనే ఉంది. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన కొన్ని బెస్ట్ టాలీవుడ్ ఫ్రెండ్ షిప్ సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి...

స్నేహం కోసం జీవితాన్నే త్యాగం చేస్తూ:

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎమోషనల్ హిట్ మూవీ 'స్నేహం కోసం'. తన మిత్రుడి కుటుంబం ఎప్పుడూ బాగుండాలని, వాళ్ల సంతోషం కోసం తన జీవితాన్నే త్యాగం చేసే ఒక గొప్ప స్నేహితుడి కథ ఇది. అప్పట్లో ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని ఆడియన్స్ లేరు.

ఫ్రెండ్ కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి:

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో కూడా స్నేహం వాల్యూని చాలా బాగా చూపించారు. ఇక పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈఓ అయిన హీరో.. తన కాలేజీ ఫ్రెండ్ పడుతున్న కష్టాల గురించి తెలుసుకుని, అతని కోసం ఊరికొచ్చి చేసే పోరాటం అందరి మనసులనూ గెలుచుకుంది.

కాలేజీ డేస్ గుర్తోచ్చే 'హ్యాపీ డేస్':

ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల మ్యాజిక్ 'హ్యాపీ డేస్' గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నలుగురు స్నేహితుల మధ్య ఉండే అల్లరి, ప్రేమ, గొడవలు, ఒకరికొకరు ఇచ్చుకునే సపోర్ట్‌ను ఇందులో చాలా న్యాచురల్‌గా చూపించారు. ఇక ఈ సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ఒక ఎగ్‌జైటింగ్‌ మెమరీ.

వన్-సైడ్ ఫ్రెండ్ షిప్ అంటే 'ఆర్య':

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా 'ఆర్య'. ఇందులో హీరో తన ఫ్రెండ్ హ్యాపీనెస్ కోసం ఎంతటి త్యాగానికైనా రెడీ అవుతాడు. ఇక సరికొత్త కోణంలో సాగే ఈ వన్-సైడ్ ఫ్రెండ్ షిప్ కాన్సెప్ట్ అప్పట్లో యూత్‌కు ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది.

స్వచ్ఛమైన స్నేహానికి 'వసంతం':

విక్టరీ వెంకటేష్ నటించిన 'వసంతం' సినిమా ఆడ, మగ మధ్య ఉండే ప్యూర్ ఫ్రెండ్ షిప్‌కు అద్దం పట్టింది. తన చిన్ననాటి స్నేహితురాలి కోసం హీరో పడే కష్టం, ఆమెకు అండగా నిలబడే విధానం గుండెలను పిండేస్తుంది.

నిత్యనూతనం 'ప్రేమదేశం':

90ల్లో వచ్చిన 'ప్రేమదేశం' సినిమా కాలేజీ ఫ్రెండ్ షిప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మాయిని లవ్ చేసినప్పుడు వారి మధ్య వచ్చే గొడవలు, చివరకు స్నేహం కోసం ప్రేమను వదులుకునే సీన్లు హైలైట్. ఇక ఇందులోని 'ముస్తఫ్ఫా.. ముస్తఫ్ఫా..' సాంగ్ ఇప్పటికీ ప్రతి ఫ్రెండ్‌షిప్ డేకి మోగిపోవాల్సిందే.

పరీక్షల్లో ఫెయిలైతే 'లైట్ తీస్కో రా' అంటూ ధైర్యం చెప్పేవాడు, మనల్ని బాగా అర్థం చేసుకునేవాడే నిజమైన స్నేహితుడు. టాలీవుడ్‌లో ఇలాంటి ఫ్రెండ్ షిప్ బ్యాక్‌డ్రాప్‌తో ఇంకా ఎన్నో సినిమాలు వస్తూనే ఉంటాయి.. మనల్ని ఖుషీ చేస్తూనే ఉంటాయి.

Tags:    

Similar News