టాప్ టెక్నీషియన్లు హీరోగానూ సక్సెస్ అయ్యేనా?
టెక్నీషియన్లు మ్యాకప్ వేసుకుని నటులుగా తెరంగేట్రం చేయడం కొత్తేం కాదు. చాలా కాలంగా కొనసాగుతున్నదే. తాజాగా మరికొంత మంది టెక్నీషియన్లు హీరోలగా ఎంట్రీ ఇస్తున్నారు.;
టెక్నీషియన్లు మ్యాకప్ వేసుకుని నటులుగా తెరంగేట్రం చేయడం కొత్తేం కాదు. చాలా కాలంగా కొనసాగుతున్నదే. తాజాగా మరికొంత మంది టెక్నీషియన్లు హీరోలగా ఎంట్రీ ఇస్తున్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నరాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ `ఎల్లమ్మ`తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎప్పటి నుంచో మనసులో నటించాలి అనే కోరిక ఉన్నా ఇంత కాలం పెదవి దాటి రాలేదు. `ఎల్లమ్మ`కు హీరో సెట్ అవ్వకపోవడంతో? అందుకోసం తానే హీరోగా మారుతున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.
ఇందులో డప్పు కళాకారుడిగా కనిపించనున్నాడు. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. `డీసీ` సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. సినిమాలో ఆయనకు జోడీగా వామిగా గబ్బి నటిస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఈ సినిమా తర్వాత లోకేష్ నటుడిగా కొన సాగుతుడా? లేదా? అన్నది చూడాలి. అలాగే మాలీవుడ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్ `విత్ లవ్` తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇందులో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. మదన్ ధర్శకత్వం వహిస్తున్నాడు.
వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే టాలీవుడ్ కోరియోగ్రాఫర్ యష్ ని హీరోగా పరిచయం చేసే బాద్యత స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసుకున్నారు. యశ్ హీరోగా `ఆకాశం దాటి వస్తావా` అనే చిత్రాన్ని రాజుగారు ప్రారంభించి చాలా కాలమవుతోంది. శశి కుమార్ ని డైరెక్టర్ గా ఎంచుకున్నారు. కానీ ఈ సినిమా ఏ దశలో ఉందో? తెలియదు. ప్రకటించి చాలా కాలమవుతుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. కానీ షూటింగ్ పూర్తయిందా? అసలు ఈ సినిమా ఉందా? రద్దయిందా? అన్నది కూడా క్లారిటీ లేదు.
అలాగే ఫైట్ మాస్టర్ ఫీటర్ హెయిన్స్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా ప్రారంభమైందా? లేదా? అన్నది తెలియదు. ఈ చిత్రానికి వెట్రీ మారన్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యారు. ప్రభుదేవా కూడా తొలుత కొరియోగ్రాఫర్ గానే పని చేసాడు. ఆ తర్వాతే నటుడిగా, దర్శకుడిగా తెరంగేట్రం చేసి సక్సెస్ అయ్యాడు. రాఘవ లారెన్స్ కూడా కొరియోగ్రాఫర్ గానే ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా, హీరోగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.