శర్వానంద్ లో కసి పట్టుదల కొట్టి చూపించేలా!
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత యంగ్ హీరో శర్వానంద్ `నారీ నారీ నడుమ మురారీ`తో హిట్ అందుకున్నాడు.ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో పరాజయాలు చూసాడు.;
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత యంగ్ హీరో శర్వానంద్ `నారీ నారీ నడుమ మురారీ`తో హిట్ అందుకున్నాడు.ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో పరాజయాలు చూసాడు. సొంతంగా కొన్ని సినిమాల్ని నిర్మించాడు. నిర్మాతల ఇబ్బందుల్ని గుర్తించి పైనాన్స్ సహకారం అందించాడు. హీరోని నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాత నష్ట పోకూడదని భావించి అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే తన ఫరిది దాటి కూడా వ్యవహరించాడు. అలా తన సహాయం పొందిన కొందరు నిర్మాతలకు ఎంత మాత్రం కృతజ్ఞతా భావం లేదని శర్వానంద్ ఓపెన్ గానే అనేసాడు.
సాధారణంగా హీరోలు ఇలాంటి విషయాలు ఎన్ని ఉన్నా? మీడియా ముందు మాట్లాడరు. లోపల ఎన్ని ఉన్నా? అలాంటి వాటిని పెదవి దాటనివ్వరు. కానీ శర్వానంద్ ఓపెన్ అయ్యాడంటే? సినిమా పేరుతో తానెంత మోస పోయాడు? అన్నది అద్దం పడుతుంది. శర్వానంద్ ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అవుతుంది. ఎన్నో సినిమాలు చేసాడు. సొంత బ్యానర్లో ఎన్నో సినిమాలు చేసాడు. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి. కొన్ని ప్లాప్ అయ్యాయి. ప్లాప్స్ తో చాలా నష్టాలు చూసాడు. కానీ ఏనాడు శర్వా నోట తనని మోసం చేసారు? అనే మాట రాలేదు.
ఆర్దికంగా ఎలాంటి పరిస్థితులున్నా? బ్యాలెన్స్ చేసుకుంటూనే ముందుకు సాగాడు. ఒకానొక దశలో చేసిన అప్పులు తీర్చడానికి ఆరేళ్ల పాటు రూపాయి ఖర్చు పెట్టకుం డా సంపాదించిందంతా అప్పులు తీర్చడానికే కేటాయించాడు. ఈ ఆరేళ్లలో ఒక్క షర్ట్ కూడా కొనుక్కోలేదని, ఉన్న వాటితోనే సర్దుకుని ముందుకు సాగినట్లు గుర్తు చేసుకున్నాడు.`నారీ నారీ నడుమ మురారీ` సక్సెస్ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత అనీల్ సుంకరతో మరిన్ని సినిమాలు చేస్తానని శర్వానంద్ ప్రకటించాడు. హీరో-నిర్మాత కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో? సాధించి చూపిస్తామని శర్వా నంద్ సవాల్ విసిరాడు.
అలాగే గత అనుభవాల నేపథ్యంలో మునుపటిలా తన తత్వం ఉండదని మోసం జరిగితే వెంటనే దాని గురించి స్పందించాలన్నారు. కృతజ్ఞతా భావం లేని వారితో కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నట్లు శర్వా మాటల్లో అర్దమవుతుంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. `బైకర్` అనే స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియాలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే `భోగీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందకు రానున్నాయి.