పవన్ డైలాగ్ టీషర్ట్ తో శ్రీలీల.. మామూలుగా లేదుగా!
ముఖ్యంగా ట్రైలర్ లో వినిపించిన 'ఇచ్చి పడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం' అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.;
భారీ అంచనాల మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల అయ్యేందుకు రెడీ అవుతుండగా.. మూవీ టీమ్ ప్రమోషన్స్ ను మరింత స్పీడప్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఆ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు ఈవెంట్స్ ద్వారా సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.
ముఖ్యంగా ట్రైలర్ లో వినిపించిన 'ఇచ్చి పడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం' అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అందరినీ ఇట్టే ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఆ డైలాగ్ ను సరికొత్తగా ప్రమోట్ చేస్తూ హీరోయిన్ శ్రీలీల చేసిన ప్రయత్నం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల ఆ వైరల్ డైలాగ్ ను తన టీ షర్ట్ పై ప్రింట్ చేయించుకుని కనిపించింది.
ఎయిర్ పోర్ట్ లో ఆమె నడుస్తూ ఉండగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ షర్ట్ పై ఉన్న డైలాగ్ చూసి పవన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ క్రియేటివ్ ప్రమోషన్ స్ట్రాటజీతో సినిమాపై ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు. అయితే ఉస్తాద్ లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
సినిమాలో కీలక పాత్రల్లో ఆర్. పార్తీబన్, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్ సహా పలువురు కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తన మాస్ డైలాగ్స్ తో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తున్నారు. సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ సమకూర్చారు. స్క్రీన్ ప్లేలో దశరథ్ పనిచేయడం సినిమాకు మరో అసెట్ అవ్వనుంది.
ఇక గతంలో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటగా ఆ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, అభిమానుల ఆసక్తి దృష్టిలో ఉంచుకుని వారం ముందుగానే మార్చి 19కు రిలీజ్ ను ముందుకు తీసుకువచ్చారు.
ఇక హీరోయిన్ శ్రీలీలకు ఉస్తాద్ చాలా కీలకంగా మారింది. ఇటీవల ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో, ఆ ప్రాజెక్ట్ పై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. అలాగే రాశీ ఖన్నా కూడా టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. ఏదేమైనా మాస్ ఎలిమెంట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, స్టార్ కాస్టింగ్.. అన్నీ కలిసిన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.