2026..మెగా నామ సంవ‌త్స‌రం

2026 మెగా నామ సంవ‌త్సం అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ విష‌యాన్ని ఈ ఇయ‌ర్ స్టార్టింగ్‌లోనే నిజ‌మ‌ని నిరూపించ‌బ‌డింది.;

Update: 2026-01-25 03:52 GMT

2026 మెగా నామ సంవ‌త్సం అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ విష‌యాన్ని ఈ ఇయ‌ర్ స్టార్టింగ్‌లోనే నిజ‌మ‌ని నిరూపించ‌బ‌డింది. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ జోష్‌ని అందించింది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు` మూవీతో బ‌రిలోకి ద‌గ‌డం..బాక్సాఫీస్ వ‌ద్ద భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని శుభారంభాన్ని అందించారు. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 12న విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోతో యునానిమ‌స్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టి వ‌ర‌కు రూ.300 కోట్ల మార్కుని దాటి విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. అంతే కాకుండా అత్యంత త‌క్కువ టైమ్‌లోనే ఈ ఏడాది ఈ ఫీట్‌ని సాధించిన తొలి ప్రాంతీయ సినిమాగా `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు` రికార్డు సాధించింది. ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్‌లో ఉన్న మెగా అభిమానుల‌కు ఈ ఏడాది బ్యాక్‌టు బ్యాక్ మెగా స‌ర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. దీంతో ఈ ఏడాది మెగా ఫ్యాన్స్‌కు మ‌ర్చిపోలేని ఏడాదిగా మార‌బోతోంది.

అందుకే ఈ ఇయ‌ర్‌గా మెగా నామ సంవ‌త్స‌రంగా అంతా అభివ‌ర్ణిస్తున్నారు. చిరు `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`తో అందించిన శుభారంభాన్ని మిగ‌తా మెగా హీరోలు కంటిన్యూ చేయ‌బోతున్నారు. మార్చి 26న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` రాబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లై ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏ రేంజ్‌లో హంగామా సృష్టించ‌డం ఖాయం అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ఈ మూవీ త‌రువాత గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న `పెద్ది` రాబోతోంది.

బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా క‌న్న‌డ సూపర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మే 1న రాబోతోంది. ఇక మెగాస్టార్ న‌టిస్తున్న మ‌రో భారీ గ్రాఫిక‌ల్ మైథ‌లాజిక‌ల్ డ్రామా `విశ్వంభ‌ర‌` జూలై 10న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మెగా హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఒకే ఒక్క నెల తేడాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. వీరితో పాటు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కూడా బ‌రిలోకి దిగుతున్నాడు.

తొలిసారి హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థ‌ని ఎంచుకుని వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న మూవీ `కొరియ‌న్ క‌న‌క‌రాజు`. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టైటిల్ గ్లింప్స్‌తో అంచ‌నాల్ని పెంచేసిన టీమ్ స‌మ్మ‌ర్‌కు వ‌చ్చేస్తున్నామంటూ ప్ర‌క‌టించింది. ఈ ఏడాది `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకుని శుభారంభాన్ని అందించినట్టే మెగా హీరోలు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకుంటారా? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని నెల‌లు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News