మెగా లైనప్ అదిరింది.. కానీ 'విశ్వంభర' మాత్రం..

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 2026 సమ్మర్ హీట్ ఇప్పుడే మొదలైపోయింది. మెగా ఫ్యామిలీ నుండి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.;

Update: 2026-01-25 03:59 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 2026 సమ్మర్ హీట్ ఇప్పుడే మొదలైపోయింది. మెగా ఫ్యామిలీ నుండి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మార్చి 26న పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', మే 1న రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ లైనప్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' మరీ ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి 'విశ్వంభర' గతేడాది సంక్రాంతికే రావాల్సిన సినిమా. కానీ గ్రాఫిక్స్ పనుల కోసం మేకర్స్ ఈ చిత్రాన్ని పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోషియో ఫాంటసీ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అస్సలు రాజీ పడకూడదని దర్శకుడు వశిష్ట భావిస్తున్నారు. అందుకే ఈ లాంగ్ గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల సంక్రాంతికి విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో మెగాస్టార్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 300 కోట్ల క్లబ్‌లో చేరి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ జోష్‌లో ఉన్న అభిమానులకు 'విశ్వంభర' ఇంత ఆలస్యం అవ్వడం కొంచెం నిరాశ కలిగించే విషయమే అయినా క్వాలిటీ కోసం వెయిట్ చేయడం తప్పదని సరిపెట్టుకుంటున్నారు.

ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పనులు హై రేంజ్‌లో ఉండబోతున్నాయని టాక్. అందుకే ప్రతి సీన్‌ను చాలా జాగ్రత్తగా చెక్కుతున్నారట. గతేడాది టీజర్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ మీద వచ్చిన కొన్ని నెగిటివ్ కామెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు టీమ్ మరింత కేర్ తీసుకుంటోంది. బాహుబలి, కల్కి లాంటి సినిమాల తర్వాత ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడంతో మేకర్స్ పై కూడా ఒత్తిడి పెరిగింది.

మరోవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సమ్మర్ స్టార్టింగ్‌లోనే విందు ఇవ్వబోతోంది. అలాగే రామ్ చరణ్ 'పెద్ది' మొదట మార్చిలో 26న రావాల్సింది. కానీ ఆ సినిమా కూడా పలు కారణాలతో ప్లాన్ మార్చేసింది. మూవీ మే 1న రాబోతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఈ సినిమాను ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు.

ఇలా మెగా హీరోలందరూ నెల రోజుల గ్యాప్‌లో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు. చివరగా వచ్చే 'విశ్వంభర' మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలి. గ్రాఫిక్స్ కోసం ఇంత టైమ్ తీసుకున్నారంటే అవుట్‌పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. జూలైలో వచ్చే ఈ సోషియో ఫాంటసీ వండర్ తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.

Tags:    

Similar News