నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న జియో హాట్‌స్టార్.. టాప్ 10 లిస్ట్ ఇదే!

డిజిటల్ వినోద ప్రపంచంలో ఇప్పుడు అసలైన పోటీ మొదలైంది. ఒకప్పుడు కేవలం టీవీలకే పరిమితమైన ఆడియన్స్, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల ద్వారా ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్‌కు అలవాటు పడిపోయారు.;

Update: 2026-01-25 03:59 GMT

డిజిటల్ వినోద ప్రపంచంలో ఇప్పుడు అసలైన పోటీ మొదలైంది. ఒకప్పుడు కేవలం టీవీలకే పరిమితమైన ఆడియన్స్, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల ద్వారా ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్‌కు అలవాటు పడిపోయారు. గ్లోబల్ మార్కెట్‌లో ఏ ఓటీటీ సంస్థ అత్యధిక సబ్‌స్క్రైబర్లతో నంబర్ వన్ స్థానంలో ఉందనే చర్చ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీసుల జాబితాలో నెట్‌ఫ్లిక్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ఒక భారతీయ సంస్థ దానికి అతి సమీపంలోకి రావడం విశేషం.

​డిజిటల్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ 302 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ఒరిజినల్ కంటెంట్, ఇంటర్నేషనల్ మూవీస్, రీజినల్ సినిమాలపై నెట్‌ఫ్లిక్స్ పెట్టిన ఫోకస్ ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టింది. అయితే, గతంలో డిస్నీ+ హాట్‌స్టార్, జియో విలీనం తర్వాత ఏర్పడిన 'జియో హాట్‌స్టార్' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కేవలం 300 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో ఇది రెండో స్థానంలో నిలిచి, నంబర్ వన్ స్థానానికి కేవలం రెండు మిలియన్ల దూరంలోనే ఉంది.

​భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న దేశంలో క్రికెట్ స్ట్రీమింగ్ హక్కులు తక్కువ ధరకే ప్లాన్స్ అందించడం జియో హాట్‌స్టార్‌కు కలిసి వచ్చింది. ముఖ్యంగా ఐపీఎల్ ఇతర భారీ స్పోర్ట్స్ ఈవెంట్స్ వల్ల సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు, అమెజాన్ ప్రైమ్ వీడియో 200 మిలియన్ల మందితో మూడో స్థానంలో ఉంది. ఈ సంస్థ కేవలం వినోదం మాత్రమే కాకుండా, ప్రైమ్ మెంబర్‌షిప్ ద్వారా షాపింగ్ బెనిఫిట్స్ కూడా కల్పించడం వల్ల దీనికి స్థిరమైన యూజర్ బేస్ ఉంది.

​ఈ రేసులో హెచ్‌బీఓ మాక్స్ డిస్నీ+ సంస్థలు నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్ నుండి విడిపోయిన తర్వాత గ్లోబల్ లెవల్‌లో డిస్నీ తన సబ్‌స్క్రైబర్లను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. వీటితో పాటు చైనాకు చెందిన టెన్సెంట్ వీడియో iQiyi వంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వంద మిలియన్ల మార్కును దాటి టాప్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. అమెరికా ఇతర దేశాల్లో పాపులర్ అయిన పారామౌంట్+, హులు, పీకాక్ వంటి సంస్థలు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

​ఓటీటీ రంగంలో పెరిగిన ఈ పోటీ వల్ల ప్రేక్షకులకు వైవిధ్యమైన కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్ తన క్వాలిటీతో దూసుకుపోతుంటే, జియో-హాట్‌స్టార్ వంటి సంస్థలు మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ నంబర్ వన్ వైపు అడుగులు వేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం ఈ టాప్ 10 స్ట్రీమింగ్ సర్వీసులు ప్రపంచ వినోదాన్ని శాసిస్తున్నాయి.

​ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 స్ట్రీమింగ్ సర్వీసులు (సబ్‌స్క్రైబర్ల సంఖ్య):

​నెట్‌ఫ్లిక్స్: 302 మిలియన్లు

​జియో హాట్‌స్టార్: 300 మిలియన్లు

​అమెజాన్ ప్రైమ్: 200 మిలియన్లు

​హెచ్‌బీఓ మాక్స్: 128 మిలియన్లు

​డిస్నీ+: 127 మిలియన్లు

​టెన్సెంట్ వీడియో: 117 మిలియన్లు

​iQiyi: 101 మిలియన్లు

​పారామౌంట్+: 77 మిలియన్లు

​హులు: 55 మిలియన్లు

​పీకాక్: 41 మిలియన్లు

Tags:    

Similar News