బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే..!
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 కి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.;
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 కి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో సెట్ నిర్మాణం జరుగుతోంది. మరో వైపు కంటెస్టెంట్స్ ఎంపిక విషయమై తుది దశ చర్చలు జరుగుతున్నాయి. స్టార్ మా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వంద మంది నుంచి ఇప్పటికే షార్ట్ లిస్ట్ తయారు చేశారు. దాదాపుగా 25 మందిని ఫైనల్ చేశారని, అందులో 20 మందితో ఒకటి రెండు రోజుల్లో తుది జాబితా తయారు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ సీజన్‌కి కూడా నాగార్జున హోస్ట్ అని తెలిసి పోయింది. బిగ్ బాస్ 8 తర్వాత చాలా మంది హోస్ట్ మారబోతున్నాడు అంటూ విశ్లేషణలు వచ్చాయి. స్టార్ మా నుంచి కూడా హోస్ట్ విషయమై లీక్స్ వచ్చాయి. పలువురు హీరోలతో చర్చలు జరిపారు అనే పుకార్లు షికార్లు చేశాయి. విజయ్ దేవరకొండ మొదలుకుని బాలకృష్ణ వరకు చాలా మంది పేర్లు ప్రముఖంగా చర్చ జరిగాయి. కానీ చివరకు నాగార్జున బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పటికే రెండు టీజర్‌లు వచ్చాయి. ఆ టీజర్స్ తో ఈ సీజన్‌పై అంచనాలు పెంచే విధంగా మేకర్స్ కంటెంట్ ను క్రియేట్ చేశారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ విషయంలో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.
ప్రతి సీజన్ ప్రారంభం సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ కొంత మంది పేర్లు బయటకు వస్తాయి. అందులో ఎక్కువ శాతం నిజం అవుతుంది. ఈసారి కూడా కొన్ని పేర్లు సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఎప్పటిలాగే బుల్లి తెర, వెండి తెర నటీ నటులు, యాంకర్స్, సింగర్స్‌తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్స్‌ను ఎంపిక చశారని తెలుస్తోంది. బుల్లి తెర నుంచి సాయి కిరణ్, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యూల్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లో చిన్న అమ్మాయి రమ్య మోక్ష, రీతూ చౌదరి, తేజస్విని ఎంపిక చేశారు. ఈసారి ముద్దుగుమ్మలతో బిగ్‌బాస్ మొత్తం ఫుల్ ఆఫ్ కలరింగ్ అన్నట్లుగా ఉండబోతుంది.
వీళ్లు కాకుండా ఇంకా దెబ్జానీ, సుమంత్ అశ్విన్, శివ కుమార్, ముఖేష్ గౌడ, నవ్య సామి మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9 పై ఉన్న అంచనాల నేపథ్యంలో డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతున్నారు. ఇక ఈ సీజన్ కోసం గ్రౌండ్ లెవల్ నుంచి సామాన్యులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల నుంచి లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయి. అందులోంచి కొన్నింటిని పిక్ చేసి బుల్లి తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యులు ఇద్దరు ముగ్గురు కాకుండా సెలబ్రిటీలు వర్సెస్ సామాన్యులు అన్నట్లుగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య కొన్ని వారాల పాటు టాస్క్‌లు ఉంటాయి, ఆ తర్వాత అందరినీ కలుపుతారు. ఇలా చేయడం వల్ల గొడవలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో షో హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు భావిస్తున్నారు.