• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్రో కోసం బండ్లన్న.. అలా...

బ్రో కోసం బండ్లన్న.. అలా ట్విస్ట్ ఇవ్వరుగా?

| అయితే, ఇప్పుడు మళ్లీ బ్రో మూవీ దగ్గరపడుతుండటంతో, ఈ మూవీ ఈవెంట్ కి మాత్రం బండ్లన్నకి ఇన్విటేషన్ వచ్చిందట

By - Tupaki Desk
Update: 2023-07-25 06:52 GMT

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని గా అందరికీ సుపరిచితమే. అయితే, బండ్ల గణేష్ తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఎక్కువగా తనకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా కొన్ని విషయాలపై స్పందిస్తూ, తన అభిప్రాయాలు చెబుతూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.

ఇక, పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ఉంటాడు. పవన్ మూవీ ఈవెంట్స్ కి తప్పకుండా హాజరౌతూ ఉంటాడు. ఆ సమయంలో ఈశ్వరా పవనేశ్వరా అంటూ పవన్ ని ఒక దేవుడిలా హైలెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ మూవీల ఈవెంట్స్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ లు హైలెట్ అనే చెప్పాలి.

అసలు పవన్ మూవీ ఈవెంట్ అంటే చాలు అక్కడ బండ్ల ప్రత్యక్షమౌతూ ఉంటాడు. అయితే, బీమ్లా నాయక్ కి మాత్రం మిస్ అయ్యాడు. అలా ఆయన రాకపోవడం వల్ల బండ్ల ఎంత ఫీలయ్యాడో లేదో తేలీదు.

కానీ, ఫ్యాన్స్ మాత్రం చాలా నిరుత్సాహానికి గురయ్యారు. బండ్లన్న మీరు ఎందుకు రాలేదు, మీ స్పీచ్ మిస్ అయ్యాం అంటూ ఫ్యాన్స్ ఆయనకు కామెంట్స్ కూడా చేశారు. ఆయనకు ఇన్విటేషన్ రాకపోవడంతో ఆయన ఈవెంట్ కి హాజరు కాలేదు.

అయితే, ఇప్పుడు మళ్లీ బ్రో మూవీ దగ్గరపడుతుండటంతో, ఈ మూవీ ఈవెంట్ కి మాత్రం బండ్లన్నకి ఇన్విటేషన్ వచ్చిందట. అంతే, ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ ని పొగుడుతూ బండ్ల ఎలాంటి మాటలు చెబుతాడా అని ఆయన స్పీచ్ కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. కానీ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఉండకపోవచ్చు అనే గాసిప్స్ కూడా వస్తున్నాయి. ఆయన ఈవెంట్ కు వచ్చి మాట్లాడకపోతే మాత్రం ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇదిలా ఉండగా, ఇటీవల ఓ సారి పవన్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అంటూ పేర్కొన్నాడు. మరి ఈ డ్రీమ్ గురించి అయినా స్పీచ్ లో ఆయన స్పందిచే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి మరీ, బండ్ల గణేష్ తన స్పీచ్ తో ఎలా అదరగొట్టనున్నాడో.

Tags:    
  • BroMovie 
  • Bandlaganesh 
  • Speech 
  • Tollywoodproducer 
  • Bheemlanayak 
  • Vakeelsab 
  • Brofilm 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS