మీరు పెన్ డౌన్ చేస్తే మేం వణికిపోతాం : బండ్ల గణేష్

సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది.;

Update: 2025-10-23 05:30 GMT

సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఆయన ఎప్పుడు మైక్ పట్టుకున్నా కూడా స్పీచ్ అదిరిపోతుంది. సిద్ధు తెలుసు కదా ఈవెంట్ లో ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాదు బండ్ల గణేష్ ఈవెంట్ కి వస్తున్నారు అంటే ఆయన ఏం మాట్లాడుతారన్నది డిస్కషన్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లో కూడా తన సెకండ్ హాఫ్ గురించి చెప్పి సర్ ప్రైజ్ చేశారు బండ్ల గణేష్.

మీడియా మీద మనసులో భావాన్ని..

ఇక సిద్ధు వండే వండర్ అనుకున్నాం కానీ ఈ సినిమాలో ఆయన ఫేస్ మార్చి అదరగొట్టాడని అన్నారు. రవితేజకు ఆల్టర్నేట్ ఎవరవుతారనుకుంటే సిద్ధు అవుతాడని అనిపించిందని అన్నారు. ఇక మీడియా వాళ్ల మీద ఈ ఈవెంట్ లో తన మనసులో భావాన్ని వ్యక్తం చేశారు బండ్ల గణేష్. మీడియా మా జీవితాలను ప్రజలకు తెలియచేస్తుంటారు. పండగ రోజు ఈవెంట్ పెట్టినా వస్తారు.. మా పండగ మీ పండగ చేసుకుంటారు.

సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేది మీడియా.. ఒక్కసారి మీరు పెన్ డౌన్ చేస్తే మేము వణికిపోతాం.. ప్రజలకు, సినిమా వాళ్లకు వారధి, సారధిగా మీడియా ఉంటుందని.. మేం అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి పెద్ద స్థాయికి వెళ్లినా మీడియా వాళ్లు అంతే గౌరవం ఇస్తారు. సినిమా పరిశ్రమకు మీడియా సపోర్ట్ ఉండాలని ఉంటుందని అన్నారు బండ్ల గణేష్.

మీడియా లేనిది పరిశ్రమ లేదని..

బండ్ల గణేష్ స్పీచ్ లో మీడియా గురించి ఆయన చేసిన కామెంట్స్ ముమ్మాటికీ నిజమే. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేది మీడియానే.. ఐతే కొన్నిసార్లు సినిమాలు మీడియాల వల్ల మిస్ గైడ్ అవుతున్నాయన్న కామెంట్ ఉంటుంది. కానీ మీడియా లేనిది పరిశ్రమ లేదని బండ్ల గణేష్ లాంటి నిర్మాతలు చెబుతుంటారు. ఈవెంట్ ఏదైనా బండ్ల గణేష్ వచ్చారంటే చాలు ఆ జోష్ వేరేలా ఉంటుంది.

తెలుసు కదా సక్సెస్ ఈవెంట్ లో బండ్ల గణేష్ సిద్ధు జొన్నలగడ్డపై చేసిన కామెంట్స్ తో పాటు మీడియా పై ఆయనకున్న అభిమానాన్ని చాటి చెప్పారు. ప్రస్తుతం బండ్ల గణేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను అనుకున్న విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే బండ్ల గణేష్ ఈమధ్య తరచు సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. ఈమధ్యనే లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ కి అటెండ్ అయిన బండ్ల గణేష్ తెలుసు కదా సక్సెస్ ఈవెంట్ లో కూడా సర్ ప్రైజ్ చేశారు. ఐతే ఈవెంట్ లో ఆయన తన బ్యానర్ లో సెకండ్ హాఫ్ మొదలవుతుందని చెప్పడంపై సినీ లవర్స్ హ్యాపీగా ఉన్నారు.






Tags:    

Similar News