బాలయ్య పాత సినిమాలు చూసిన బ్యాచ్ కాదది!
బాలయ్య గత సినిమాలు చూస్తే? ఇలాంటి సందేహాలు వాళ్లకు రావు అన్నది వాస్తవం. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన బాలయ్య పాత సినిమాలు చూస్తే? అసలి సంగతేంటన్నది వాళ్లకు తెలుస్తుంది.;
తొడ గొడితే రన్నింగ్ ట్రైన్ వెనక్కి వెళ్లడం...చిటికేస్తే పైనున్న ఉయ్యాల ఊడిపడటం..కళ్లెర్రజేస్తే కుర్చీ దూసుకు రావడం..గొడ్డలి ఎత్తితే? ఒకేసారి పది తలకాలయలు తెగడం వంటి సన్నివేశాలు బాలయ్యకు మాత్రమే సాధ్యం. యాక్షన్ సన్నివేశాల పరంగా ఎలాంటి ఎలివేషన్ ఇచ్చినా? పండించడం మాత్రం సింహానికే చెల్లింది. ఇవన్నీ రెండు దశాబ్దాల క్రితమే బాలయ్య చేసేసారు. 2000 ఎరాలోనే యాక్షన్ సన్నివేశాల్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన నటుడు. కాలక్రమంలో వాటికి అప్డేషన్ చేయడమే బాలయ్య ప్రత్యేకత. కొంత కాలంగా బాలయ్య సినిమాల్లో త్రిశూలం తో తెగ నరికే సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి.
ఆయన సినిమాలో లాజిక్కులా?
ప్రత్యేకించి `అఖండ` సినిమాలో ఆ సన్నివేశాలు ఏ రేంజ్లో పండిచారో తెలిసిందే. `అఖండ2 శివ తాండవం`లో అంతకు మించి ఉంటాయని ముందే హింట్ ఇచ్చేసారు బోయపాటి. ఇదీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అది ప్రూవ్ అయింది. బిగ్ స్రీన్ లో ఆ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయన్నది బాలయ్య అభిమానుల ఆశ. అయితే త్రిశూలం, గన్ ప్రాపర్టీస్ వాడి చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు లాజిక్ కి దూరంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది నెటి జనరేషన్ యువత వ్యక్తం చేసిన అసంతృప్తి మాత్రమే.
రాయలసీమ కథలు చూస్తే సరి:
బాలయ్య గత సినిమాలు చూస్తే? ఇలాంటి సందేహాలు వాళ్లకు రావు అన్నది వాస్తవం. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన బాలయ్య పాత సినిమాలు చూస్తే? అసలి సంగతేంటన్నది వాళ్లకు తెలుస్తుంది. అయినా స్టంట్ మాస్టర్లు ఈ విమర్శలకు బధులివ్వాల్సిన బాధ్యత వారిపై ఉంది కాబట్టి రామ్ లక్ష్మణ్ వాటిపై స్పందించారు. సినిమాలో బాలయ్య శివ అనుగ్రహం గల పాత్ర పోషిస్తున్నారు. సహజంగానే గన్ కి పవర్ ఎక్కువ. ఆ పవర్ కి త్రిశూలం తోడై?దానికి శివశక్తి జతకడితే దైవిక శక్తి రెట్టింపు అవుతుంది. అందుకు తగ్గట్టే యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసినట్లు తెలిపారు.
ప్రతీ పాత్ర ప్రత్యేకంగా:
ఇందులో బాలయ్య త్రిపాత్రాభినయం పోషిస్తున్నారుట. వాటిలో ప్రతీ పాత్రకి ఓ ప్రత్యేకత ఉంటుంది. అవి మూడ పరిమితులు, శక్తులతో కూడిన పాత్రలగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రతీ యాక్షన్ సీన్ డిజైన్ ఉంటుంది.
`అఖండ`లో రధచక్రం సన్నివేశానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి సిగ్నేచర్ సీన్ `అఖండ 2`లోనూ ఉంటుందంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రచారం పనులు జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఇండియా అంతటా టీమ్ చుట్టేస్తోంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.