• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  50 రోజులపాటు బాలయ్య@50...

50 రోజులపాటు బాలయ్య@50 సెలబ్రేషన్స్.. ప్లాన్ వేరే లెవెల్!

| నందమూరి నటసింహం బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన అభిమానులు ఉన్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-07-12 09:33 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. బాలయ్య సినిమా రిలీజ్ అయితే చాలు.. వారంతా పండుగలా జరుపుకుంటారు. తెరపై ఆయన మాస్ యాక్షన్ చూసి ఈలలు వేసి రచ్చ రచ్చ చేస్తుంటారు. తమ అభిమాన హీరో కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. అందుకే బాలయ్య కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ శరవేగంగా షూటింగ్ లను పూర్తి చేస్తుంటారు.

గత ఏడాది వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వచ్చి హ్యాట్రిక్ హిట్లు కొట్టిన బాలకృష్ణ.. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. బాలయ్యను వేరే లెవల్ లో చూపించనున్నారు బాబీ. అయితే ఇప్పటి వరకు 108 సినిమాలు చేసిన నందమూరి నటసింహం.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 2024 ఆగస్టు 30వ తేదీతో 50 ఏళ్లు పూర్తవ్వనుంది.

ఆయన నటించిన తాతమ్మ కల.. 1974 ఆగస్టు 30వ తేదీన రిలీజ్ అయింది. స్వర్గీయ ఎన్టీఆర్.. దర్శకత్వం వహించిన ఆ సినిమాతోనే బాలయ్య కెరీర్ స్టార్ట్ చేశారు. తన బ్రదర్ హరికృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి విజయవంతంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కళారంగానికి బాలకృష్ణ చేసిన కృషి, సేవలకుగాను తెలుగు సినీ ఇండస్ట్రీ ఆయనను సన్మానించనుంది. సెప్టెంబరు 1వ తేదీన ఘనంగా వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

అయితే బాలయ్యకు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. వివిధ సామాజిక కార్యక్రమాలు చేసే ఆ సంఘాలు.. ఇప్పుడు బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను 50 రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నాయి. జులై 12వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఆ వేడుకలు జరగనున్నాయి. అందుకు ప్రత్యేకంగా 'నందమూరి వారసత్వం అన్ స్టాపబుల్' అంటూ డిజైన్ చేయించిన సింబల్ ను బాలయ్యకు తాజాగా అందించారు.

ఇక బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. డైలీ ఉదయం కౌంట్ డౌన్ కామన్ డీపీని రిలీజ్ చేయనున్నారు. సాయంత్రం బాలయ్య షార్ట్స్, రీల్స్ ను షేర్ చేయనున్నారు. ప్రతీ శనివారం బాలకృష్ణ గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలను రివీల్ చేయనున్నారు. ఆయన సినిమాలను స్పెషల్ షోస్ గా వేయనున్నారు. ప్రతీ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొత్తానికి బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలను గట్టి గానే ప్లాన్ చేశారు అభిమానులు!

Tags:    
  • Telugufilmindustry 
  • Nandamuribalakrishna 
  • 50Successfulyears 
  • Balakrishna 
  • Balakrishna50years 
  • Tollywood 
  • Goldenjublieecelebration 
  • Balakrishnagoldenjubliee 

Similar News

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

2026-11-24 18:21 GMT

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

2026-11-24 18:19 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

భోగి వెనుక సంపత్ నంది చిన్ననాటి భయం!

2026-11-24 18:18 GMT

హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌తో 'మెగా మ‌ల్టీప్లెక్స్'

2026-11-24 18:15 GMT

కూతురి కోసం తండ్రి పోరాటం.. 'నాన్నకుట్టి' ట్రైలర్ ఎలా ఉందంటే!

2026-11-24 18:14 GMT

King 100: క్రిస్మస్ డేట్‌పై నాగ్ పట్టు.. మారేది లేదట!

2026-11-24 18:10 GMT

బ్లూ అవుట్‌ఫిట్‌లో కొత్త ఫ్యాషన్ గోల్స్ సెట్ చేసిన పూజా హెగ్డే!

2026-11-24 18:10 GMT

RGV చ‌నిపోయినా అత‌డి ఆత్మ‌ను వెంటాడే క్లోన్ రెడీ అవుతోంది!

2026-11-24 18:03 GMT

మహేశ్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. బర్త్‌డే స్పెషల్!

2026-11-24 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS