• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  NBK109: గొడ్డలి పట్టిన...

NBK109: గొడ్డలి పట్టిన బాలయ్య.. పోస్టర్‌తోనే పూనకాలు

| ఇక సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-11-12 13:57 GMT

NBK 109 సినిమాకు సంబంధించిన టైటిల్ పై ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా కూడా మాస్ ఫ్యాన్స్ లో మాత్రం అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే వాల్తేరు వీరయ్యతో దర్శకుడిగా బిగ్ హిట్ అందుకున్న బాబీ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో పూనకాలు తెప్పించే సీన్స్ పక్కా ఉంటాయని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. జనవరి 12ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేయనున్నారు.


అయితే ప్రమోషన్ హడావుడి కూడా స్టార్ట్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ఇటీవల విడుదలైన NBK109 పోస్టర్ చూసి నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమా టైటిల్ టీజర్ నవంబర్ 15న ఉదయం 10:24 గంటలకు విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ రక్తంతో తడిసిన గొడ్డలితో బ్యాక్ స్టిల్ ఇచ్చారు.

యాక్షన్ డోస్ సినిమాలో మాములుగా ఉండదని ఈ ఒక్క పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చారు. మాస్ కాస్ట్యూమ్ అలాగే మరో తుపాకీ కూడా వీపుకి తగిలించుకున్న విధానం హైలెట్ అయ్యింది. గొడ్డలి, తుపాకీ లాంటి ఆయుధాలను చూస్తుంటే బాలయ్య ఈ సినిమాలో ఊచకోత కోయడం గ్యారెంటీ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆయన లుక్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనున్నట్లు అర్ధమవుతుంది.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ తనలోని మాస్ అవతారాన్ని మరోసారి ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో ఆయన గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తారుని క్లారిటీ వచ్చేసింది, లుక్ అయితే నందమూరి అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

ఇక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో ప్రతీనాయకుడి పాత్రలో నటిస్తుండగా, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రాబోతుందోని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణ బాధ్యతలను చేపట్టగా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా, నిరంజన్ దేవరమానే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • NBK109 
  • Poster 
  • Teaserannouncement 
  • Balakrishna 
  • Bobbydoel 
  • KsBobby 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS