నందమూరి ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
ఇప్పటికే బాలయ్యకు `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` వంటి హ్యాట్రిక్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ అందించి థమన్ పల్ స్వింగ్ లో ఉన్నాడు.
నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న చిత్రాల అప్‌డేట్స్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన సంగీత సమరం తెరపైకి వస్తోంది. సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న ఎస్.ఎస్. థమన్ - అనిరుధ్ రవిచందర్ ఇద్దరూ ఒకే రోజున బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. NBK109 - NBK110 చిత్రాల మ్యూజికల్ కంటెంట్ బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని జూన్ 10న ఒకే రోజున విడుదలవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి.
ఇప్పటికే బాలయ్యకు `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` వంటి హ్యాట్రిక్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ అందించి థమన్ పల్ స్వింగ్ లో ఉన్నాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న NBK109 చిత్రానికి థమన్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు ఎలాంటి మాస్ బీట్స్ ఇవ్వాలో? థియేటర్లలో పూనకాలు తెప్పించేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ప్లాన్ చేయాలో? థమన్‌కు కొట్టిన పిండి. ఈ నేపథ్యంలో టీజర్ తో పాటు టైటిల్ గ్లింప్స్ కి ఎలాంటి ఆర్ ఆర్ తో వస్తుందా? అన్న ఉత్కంట అందరిలోనూ నెలకొంది.
అలాగే 110వ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ గ్లింప్స్ ను కూడా జూన్ 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య లార్జర్-ద్యాన్-లైఫ్ ఇమేజ్‌కు అనిరుధ్ ఇచ్చే సరికొత్త సౌండింగ్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ నెలకొంది. ఇలా ఒకే రోజు ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు బాలయ్య సినిమాలతో తలపడుతుండటంతో టాప్ గేర్ లో ఎవరు నిలుస్తారనే చర్చ నడుస్తోంది. థమన్‌కు బాలకృష్ణ పల్స్ - మాస్ ఆడియన్స్ పల్స్పై పట్టుండటం ప్లస్ పాయింట్ అయితే.. అనిరుధ్‌కు ఉన్న నేషనల్ క్రేజ్ , ఫ్రెష్ కాంబినేషన్ హైప్ ఈ ప్రాజెక్ట్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నాయి.
ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి గట్టిగానే పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. నందమూరి అభిమానులకు మాత్రం ఇది పండగ లాంటి రోజని చెప్పొచ్చు. ఒకే రోజున తమ అభిమాన హీరోకి సంబంధించిన రెండు క్రేజీ చిత్రాల అప్‌డేట్స్, అది కూడా టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ల కాంబినేషన్‌లో రావడం సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్స్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాలు కూడా ఈ రెండు చిత్రాల మ్యూజికల్ ఇంపాక్ట్ సినిమా బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి. థమన్ వర్సెస్ అనిరుధ్ రేసులో గెలుపు ఎవరిదైనా సరే? చివరిగా లబ్ధి పొందేది మాత్రం బాలకృష్ణ సినిమాలే. ఒకరు మాస్ ఎలివేషన్లకు కేరాఫ్ అడ్రస్ అయితే.. మరొకరు మోడ్రన్ ట్రెండీ మ్యూజిక్‌కు బ్రాండ్ అంబాసిడర్. ఇద్దరి అల్టిమేట్ సౌండింగ్ థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో? చూడాలి.