మౌనం అంగీకారమేనా బాలయ్య..?

ఐతే ఈ సినిమాను సెప్టెంబర్ 25న దసరా కానుకగా రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా ఆ టైం కు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు.;

Update: 2025-08-18 06:57 GMT

ఇటు సినిమాలు అటు పాలిటిక్స్ రెండిటి మధ్య బాలకృష్ణ బిజీ బిజీగా ఉన్నాడు. ఐతే ఫ్యాన్స్ ఆయన సినిమా నుంచి కోరుతున్న అప్డేట్స్ విషయంలో కాస్త ముందు వెనక్కి జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అఖండ 2 సినిమా విషయంలో నందమూరి ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ రోజు రోజుకి పెరుగుతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం వస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అఖండ 2 తాండవం కోసం వి.ఎఫ్.ఎక్స్ వర్క్..

ఐతే ఈ సినిమాను సెప్టెంబర్ 25న దసరా కానుకగా రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా ఆ టైం కు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. బోయపాటి శ్రీను సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని తెలుస్తుంది. అఖండ 2 తాండవం కోసం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా బాగా కావాల్సి వస్తుంది. ఈ సీజీ వర్క్ కోసమే టైం తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ స్పెటెంబర్ 25న పవర్ స్టార్ ఓజీ సినిమా రిలీజ్ లాక్ చేశారు.

ఐతే పోటీగా అనుకున్న అఖండ 2 మాత్రం సైలెంట్ గా ఉన్నారు. సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ సైలెంట్ గా ఉంటున్నారు. అంటే దాదాపు అఖండ 2 తాండవం వాయిదాను వాళ్లు అంగీకరించినట్టే అన్నమాట. అఖండ 2 సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి ఆమధ్య వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది.

బాలయ్య తాండవం నేషనల్ లెవెల్ లో..

అఖండ 2 సినిమా లో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈసారి బాలయ్య తాండవం నేషనల్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. బాలకృష్ణ కూడా ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట. అఖండ 2 సినిమా లో సంయుక్త మీనన్ నటిస్తుంది. ఆల్రెడీ ప్రగ్యా జైశ్వాల్ కూడా ఉంటుందని తెలుస్తుంది.

అఖండ 2లో థమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. సినిమాలో థమన్ మరోసారి పూనకాలు తెప్పించే మ్యూజిక్ ఇస్తాడని అంటున్నారు. నందమూరి బాలకృష్ణ థమన్ ఈ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఈ కాంబో మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా చూస్తున్నారట. మరి అఖండ 2 హైప్ బాగుంది కానీ దసరా మిస్ అయితే మళ్లీ రిలీజ్ ఎప్పుడన్న క్లారిటీ ఇస్తే బెటర్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి మౌనం వీడి బాలయ్య అండ్ టీం అఖండ 2 సినిమాపై క్లారిటీ ఇస్తే బెటర్ అని ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు.

Tags:    

Similar News