అఖండ 2 : థియేట్రికల్ ట్రైలర్ పై బిగ్ అప్డేట్!
బాలకృష్ణ.. 65 ఏళ్ల వయసులో కూడా వరుస యాక్షన్ చిత్రాలలో నటిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.;
బాలకృష్ణ.. 65 ఏళ్ల వయసులో కూడా వరుస యాక్షన్ చిత్రాలలో నటిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఈయన పెర్ఫార్మన్స్ లైవ్ లో చూసిన పలువురు సెలబ్రిటీలు కూడా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. అలా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా.. ఏకంగా 15 డిగ్రీల రక్తం గడ్డకట్టే చలిలో బాలయ్య చేసిన పర్ఫామెన్స్ కి తాను ఒక్కసారిగా దండం పెట్టేసానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం బాలయ్య అఖండ 2: తాండవం అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో.. బాలయ్య హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'అఖండ' సీక్వెల్ గా రాబోతున్న చిత్రం 'అఖండ 2 తాండవం'. ఈ సినిమా పై అభిమానులలో మాత్రమే కాదు సినీ లవర్స్ లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇందులో బాలయ్య మాస్4 పెర్ఫార్మన్స్ చూడడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
విషయంలోకి వెళ్తే ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రాండ్ విజువల్స్ తో సాలిడ్ బిజిఎంతో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ పక్కా ప్లాన్స్ చేస్తున్నారట. అంతేకాదు ఈ ట్రైలర్లో అఘోరా టచ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా.. ఈ ఒక్క ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేలా.. అద్భుతంగా ట్రైలర్ ను డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ లవర్స్ ఈ ట్రైలర్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రెండ్ సృష్టించగా.. అటు పోస్టర్స్ కూడా అంచనాలను పెంచేశాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ తో పాటు సంయుక్త మేనన్ కూడా హీరోయిన్గా నటిస్తున్నారు.
అఖండ 2 తాండవం సినిమా విషయానికి వస్తే.. ఎస్. తమన్ స్వరాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మాస్, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలిపిన సీక్వెల్.. పూర్తిగా మాస్ ఎంటర్టైన్మెంట్ అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. అటు బాలయ్య మాస్ పర్ఫామెన్స్ .. ఇటు బోయపాటి శ్రీను డైరెక్షన్.. తమన్ మ్యూజిక్ అన్నీ కలిపి సినిమాను ఈ ఏడాది తెలుగు సినిమా ప్రేక్షకుల కోసం మాస్ ఫెస్టివల్ గా మారుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ట్రైలర్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఇంకా క్రేజ్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.