ఎల్లమ్మతో అంత ఈజీ కాదు అని ముందే చెప్పాడా?
పల్లెల్లోని మనుషుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలు..మనిషిని మనిషిని అవి ఎలా దూరం చేస్తున్నాయో చూపించిన తీరు, బంధాలని కలుపుకు పోవాలని చూపించిన విధానం ప్రేక్షకులతో పాటు పండితుల్ని కూడా ఆకట్టుకుంది.;
`బలగం`..కథను, కథలోని అర్థ్రతను బలంగా నమ్మి చేసిన సినిమా ఇది. పల్లెల్లోని మనుషుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలు..మనిషిని మనిషిని అవి ఎలా దూరం చేస్తున్నాయో చూపించిన తీరు, బంధాలని కలుపుకు పోవాలని చూపించిన విధానం ప్రేక్షకులతో పాటు పండితుల్ని కూడా ఆకట్టుకుంది. దర్శక నిర్మాతలపై ప్రశంసల వర్షం కురిపించింది. పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల్ని అందించింది. ఇలాంటి సినిమా తరువాత దర్శకుడు వేణు యెల్దండి ఎలాంటి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
అందరూ ఆసక్తిగా ఎదురుచూసినట్లే వేణు `ఎల్లమ్మ` అంటూ మరో రూటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించాడు. దిల్ రాజు నిర్మాత. రీసెంట్‌గా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేయడమే కాకుండా ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ నటిస్తున్నట్టుగా ప్రకటించారు. పర్షిగా దేవీ నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇస్తూ తన క్యారెక్టర్‌ని, సినిమాలో తన మేకోవర్‌ని చూపించి షాక్ ఇచ్చారు. హీరోగా దేవీకి ఇదే ఫస్ట్ మూవీ. కొంత కాలంగా తను హీరోగా అరంగేట్రం చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది.
ఈ ప్రచారంపై ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చిన దేవిశ్రీప్రసాద్ ఫైనల్‌గా `ఎల్లమ్మ`తో హీరోగా అరంగేట్రం చేయడానికి రెడీ అయిపోయాడు. డప్పు వాయిద్య కారుడిగా దేవీ పాత్ర ఉంటుందని గ్లింప్స్‌తో క్లారిటీ వచ్చేసింది. ఈ క్యారెక్టర్ కోసం ముందు హీరో నేచురల్ స్టార్ నానిని అనుకున్నారు. స్క్రిప్ట్ నరేషన్ అంతా అయిపోయింది. ఇక అనౌన్స్ చేయడమే తరువాయి.. అంతలోనే హీరో ఛేంజ్.. తరువాత సీన్‌లోకి నితిన్ వచ్చి చేరాడు. అంతా ఓకే `తమ్ముడు` రిలీజ్ తరువాతే సినిమా పట్టాలెక్కించాలని ప్లాన్ చేశారు.
కానీ ప్లాన్ మళ్లీ మారింది. హీరో మళ్లీ మారాడు.. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్‌లోకి దేవీశ్రీప్రసాద్ వచ్చి చేరాడు. ఇంతకీ నాని, నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటన్నది ఎవరికీ తెలియదు.. బయటికి మాత్రం డేట్స్ సమస్య, కొన్ని మార్పులు. కానీ అసలు విషయం ఏంటన్నది రీసెంట్‌గా దిల్ రాజు ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పేశాడు. `ఎల్లమ్మ` ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడే దిల్ రాజు ఇది అంత ఈజీ కాదని దర్శకుడు వేణు యెల్దండికి చెప్పాడట. సినిమా పేరు `ఎల్లమ్మ ` అన్నప్పుడు ఇందులోకి రావాలనుకున్న హీరో అంతా చూసుకున్నాకే ఎంటరవుతాడు.
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవేనా? అనే అనుమానం సహజంగానే ఉంటుంది. ఇవన్నీ నేను ఆలోచిస్తాను..అయితే బలంగం వేణుకు ఇదంతా అర్థం కాదు. ఈ కథ అనుకున్నప్పుడే వేణు ఇది అంత ఈజీ కాదని చెప్పా. ఎందుకంటే మనం పెట్టిన టైటిల్. కథ ప్రకారం `ఎల్లమ్మ` టైటిల్ తప్ప దీనికి మరోటి అనుకోలేం. మార్చడానికి కూడా లేదు. ఈ కథకు ఈ టైటిలే ఉండాలి. ఏదైతే కథలో ఉన్న సోల్ ఉందో దాన్నే తెరపైకి తీసుకురావాలి` అన అసలు విషయం బయటపెట్టాడు. నాని, నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం హీరో క్యారెక్టర్, లేడీ ఓరియెంటెడ్ టైటిల్.. హీరో డప్పు వాయిద్య కారుడు కావడం.. మరీ డీ గ్లామర్‌గా... పక్కా పళ్లెటూరి క్యారెక్టర్ కావడమేనని స్పష్టమవుతోంది. వీటి వల్లే నాని, నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మరి పక్కా రూటెడ్ స్టోరీతో హీరోగా పరిచయం అవుతున్న దేవీశ్రీప్రసాద్‌కు ఈ సినిమా హీరోగా ఎలాంటి లైఫ్‌ని ఇస్తుందో వేచి చూడాల్సిందే.