''బకాసుర రెస్టారెంట్' పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ట్రైలర్ కు మించి..'
హాస్యం, భావోద్వేగాలను మిళితం చేస్తూ ప్రేక్షకులను పూర్తిగా రెండున్నర గంటలు అలరించడానికి రూపొందిస్తున్న బకాసుర రెస్టారెంట్ ను హాంగర్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేస్తున్నారు.;
టాలీవుడ్ కమెడియన్స్ వైవా హర్ష, ప్రవీణ్ లీడ్ రోల్స్ లో నటించిన తాజా చిత్రం బకాసుర రెస్టారెంట్ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఎస్ జే శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ఎస్ జే మూవీస్ బ్యానర్ లో లక్ష్మయ్య ఆచారి నిర్మిస్తున్నారు. కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హాస్యం, భావోద్వేగాలను మిళితం చేస్తూ ప్రేక్షకులను పూర్తిగా రెండున్నర గంటలు అలరించడానికి రూపొందిస్తున్న బకాసుర రెస్టారెంట్ ను హాంగర్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఆగస్టు 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రీసెంట్ గా హైదరాబాద్ లో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా, హీరో సుధీర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా మంచి హిట్ అవ్వాలని విషెస్ కోరుకున్నారు. ప్రవీణ్ ,తనకు ఇష్టమైన నటుల్లో ఒకరిగా తెలిపారు. దర్శకుడు నటీనటుల సలహాలు అడిగినప్పుడల్లా, తాను ఎల్లప్పుడూ ఆయననే సిఫార్సు చేస్తానని పేర్కొన్నారు.
కెరీర్ లో మలుపు తిరగాలి!
ప్రతి సినిమాను విజయవంతం చేయడంలో ఆయన మక్కువ చూపుతాడని, బకాసుర రెస్టారెంట్ కెరీర్‌లో ఒక మలుపు అవుతుందని తాను ఆశిస్తున్నట్లు సుధీర్ తెలిపారు. నవ్వును ఎప్పుడూ వాయిదా వేయకూడదని, సినిమాను థియేటర్లలో మొత్తం కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి అర్హమైనదంటూ సుధీర్ బాబు హైప్ క్రియేట్ చేశారు.
ఆ తర్వాత సినిమాకు కథే హీరో అని నిర్మాత జనార్ధన్ ఆచారి తెలిపారు. మంచి కథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారని చెప్పారు.. నటుడు ప్రవీణ్, వైవా హర్ష.. ఇలా అందరం కలిసి బకాసుర రెస్టారెంట్ లో మంచి డిష్ ను ప్రిపేర్ చేశామని పేర్కొన్నారు. అందరికీ మా డిష్ నచ్చుతుందని అనుకుంటున్నానని తెలిపారు నిర్మాత.
ట్రైలర్ కు మించిన సినిమా!
విరూపాక్ష దర్శకత్వ శాఖలో పని చేశానని, ఆ సినిమా వల్ల తాను డైరెక్టర్ అయ్యానని దర్శకుడు ఎస్ జే శివ తెలిపారు. ఆ సినిమా మంచి ఎక్స్పీరియెన్స్ ఇచ్చిందని, తన గురించి అన్నయ్య నిర్మాతగా మారాడని చెప్పారు. ఈ కథకు మంచి సంగీతం కుదిరిందని, వికాస్ బడిస భవిష్యత్ లో పెద్ద సంగీత దర్శకుడవుతాడని పేర్కొన్నారు. ట్రైలర్ కు మించిన విధంగా సినిమా ఉంటుందని వెల్లడించారు. సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ఉంటాయని, అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ అని చెప్పారు. బకాసుర రెస్టారెంట్ ఇంటిల్లిపాదీ చూడాల్సిన ఎంటర్టైనర్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ అని ప్రవీణ్ అన్నారు.