• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మొన్న శ్రీమంతుడు.....

మొన్న శ్రీమంతుడు.. ఇప్పుడు బేబీ.. మేకర్స్ పై కేసు?

| బేబీ మూవీ స్టోరీ తనదేనని హైదరాబాద్‌ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో షార్ట్‌ ఫిల్మ్ డైరెక్టర్‌ కమ్ సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

By - Tupaki Desk
Update: 2024-02-10 07:44 GMT

కంటెంట్ బాగుంటే చాలు.. సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాల్లో బేబీ ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

యువతను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను సాయి రాజేష్ తెరకెక్కించి మంచి ఫేమ్ సంపాదించారు. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది వైష్ణవి చైతన్య. తన నటనతో ఈ సినిమాలో మార్కులు కొట్టేసింది. ఈ మూవీ థియేటర్స్ లోనే కాదు ఓటీటీలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ సినిమా రీమేక్ అవుతోంది. తాజాగా ఈ సినిమా స్టోరీపై వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

బేబీ మూవీ స్టోరీ తనదేనని హైదరాబాద్‌ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో షార్ట్‌ ఫిల్మ్ డైరెక్టర్‌ కమ్ సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ సినిమా కథను తాను కొన్నేళ్ల క్రితమే మేకర్స్ కు చెప్పినట్లు శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదులో పేర్కొన్నారట. కాపీరైట్ చట్టాన్ని బేబీ మేకర్స్ ఉల్లంఘించారని ఆరోపించారట. 2013లో ఓ సినిమా విషయంలో రాజేష్ తో పరిచయం ఏర్పడినట్లు శ్రీరామ్ చెప్పారట.

2015లో తాను రాసుకున్న కథకు ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టుకున్నట్లు శిరిన్ శ్రీమ్ ఫిర్యాదులో చెప్పారట. ఆ కథనే సాయి రాజేష్ సజెషన్ తో ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ కు వివరించానని పేర్కొన్నారట. ఆ స్టోరీయే బేబీ టైటిల్ తో తెరకెక్కిందని శ్రీరామ్ ఆరోపిస్తున్నారట. ఆ మూవీ కథ మొత్తం తనదేనని శిరిన్ శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఈ విషయంపై అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే శ్రీమంతుడు సినిమా స్టోరీపై ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే. రైటర్ శరత్ చంద్ర అలియాస్ ఆర్డీ విల్సన్ ఈ సినిమాపై కాపీరైట్ కేసును నమోదు చేశారు. తన చచ్చేంత ప్రేమ నవల నుంచి శ్రీమంతుడు స్టోరీని కాపీ కొట్టారని ఆరోపించారు. ఇంకా ఈ కేసు ఓ కొలిక్కి రాకముందే.. తెరపైకి బేబీ సినిమా స్టోరీ వివాదం రావడం గమనార్హం.


Tags:    
  • Tollywood 
  • Movie 
  • Baby 
  • Babymovie 
  • Sairajesh 
  • Copyright 
  • Shirinsriram 
  • Complaint 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS