బాహుబలి ఎపిక్ వెర్షన్.. టాప్ ప్లేస్ కొట్టేస్తుందా?

అయితే రీ రిలీజుల్లో ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.;

Update: 2025-10-28 12:32 GMT

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలి రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం బాహుబలి ది బిగినింగ్ మూవీని తీసుకొచ్చిన జక్కన్న.. ఎనిమిదేళ్ల క్రితం బాహుబలి ది కన్ క్లూజన్ ను విడుదల చేశారు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో హిట్స్ గా నిలిచాయి.

ఇప్పుడు ఆ రెండు సినిమాలను ఒకే పార్టుగా బాహుబలి: ది ఎపిక్ పేరుతో మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీన కొత్త వెర్షన్ ను విడుదల చేయనుండగా.. ముందు రోజు ప్రీమియర్స్ కూడా వేయనున్నారు. కేవలం రీ రిలీజ్‌గానే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేలా మెరుగైన సాంకేతిక హంగులతో తీసుకువస్తున్నారు.

ఐమాక్స్ తో పాటు 4DX,డాల్బీ సినిమా వంటి అత్యాధునిక ఫార్మాట్లలో సినిమాను విడుదల చేయనున్నారు. రీమాస్టర్డ్ పిక్చర్, సౌండ్ క్వాలిటీతో ఆడియన్స్ కు మంచి అనుభూతి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ను కూడా మొదలుపెట్టారు. ఓపెన్ అయిన క్షణం నుంచి ఓ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి.

హాట్ కేకుల్లా టికెట్లు సేల్ అవుతున్నాయి. దీంతో రీ రిలీజుల్లో బాహుబలి : ది ఎపిక్ వెర్షన్.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనుందని అంతా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ.5 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. పోటీ పడి మరీ బాహుబలి : ది ఎపిక్ వెర్షన్ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు సినీ ప్రియులు, అభిమానులు.

అయితే రీ రిలీజుల్లో ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. తొలి రోజు హైయెస్ట్ గ్రాస్ వసూళ్లను అందుకున్న సినిమాగా నిలిచింది. రూ.8.26 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. ఆ లిస్ట్ లో ఖలేజా తర్వాత గబ్బర్ సింగ్, మురారి, బిజినెస్ మ్యాన్, అతడు చిత్రాలు ఉన్నాయి. మరి అవి ఎంత రాబట్టాయంటే?

1. ఖలేజా 4కె – రూ.8.26 కోట్లు

2. గబ్బర్ సింగ్ 4కె – రూ.6.80 కోట్లు

3. మురారి 4కె – రూ.5.45 కోట్లు

4. బిజినెస్ మ్యాన్ 4కె – రూ.5.31 కోట్లు

5. అతడు 4కె – రూ.5.26 కోట్లు

అయితే ఇప్పటికే బాహుబలి చిత్రాల రీ రిలీజ్ వెర్షన్ వివిధ రికార్డులను బ్రేక్ చేయనుందని అంచనాలు ఉండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్న తీరు బట్టి.. కచ్చితంగా భారీ వసూళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి పైన చెప్పుకున్న హైయెస్ట్ డే 1 గ్రాసర్స్ లిస్ట్ లో బాహుబలి : ది ఎపిక్ ఏ ప్లేస్ ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News