• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆశలు వదులుకున్న దిల్...

ఆశలు వదులుకున్న దిల్ రాజు?

| తాజాగా రాజు బేనర్ లో 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్‌తో సినిమా అనేసరికి ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది.

By - Tupaki Desk
Update: 2024-04-14 00:30 GMT

టాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. కుటుంబ కథా చిత్రాలతో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆయన్నుంచి ఒక ఫ్యామిలీ సినిమా వస్తోందంటే అది కచ్చితంగా సూపర్ హిట్టే అనే నమ్మకముండేది ఒకప్పుడు. కానీ ఈ మధ్య ఆయన బ్రాండ్ వాల్యూ దెబ్బ తింటోంది. రాజు స్థాయికి తగ్గ సినిమాలు రావట్లేదు.

తాజాగా రాజు బేనర్ లో 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్‌తో సినిమా అనేసరికి ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. బ్యాడ్ టాక్, రివ్యూలతో మొదలై రెండో రోజే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిందీ సినిమా. తొలి రోజు బ్యాడ్ టాక్ తర్వాత కూడా వసూళ్లు బాగానే ఉండడంతో రాజు ఆశాభావంతో కనిపించారు. వీకెండ్ వరకు బండి బాగానే నడుస్తుందనుకున్నారు. కానీ రెండో రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి.

రాజు ఎంతో శ్రద్ధ పెట్టి పబ్లిసిటీ చేసినా.. స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకుంటూ సినిమాను పుష్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వీకెండ్లోనే నిలబడలేకపోయిన ఈ చిత్రం మంగళవారం ఉగాది సెలవు తర్వాత దాదాపుగా వాషౌట్ అయిపోయిన పరిస్థితి. ఆ రోజు వరకు రాజు కూడా పబ్లిసిటీ పరంగా కొంచెం ఎఫర్ట్ పెట్టారు. కానీ తర్వాతి రోజు నుంచి సినిమా మీద ఆయన ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది.

రెండో వీకెండ్లో సినిమా పుంజుకునే అవకాశాలు పెద్దగా లేవని అర్థమై ఆయన ఈ సినిమాను పక్కన పెట్టేశారు. తన అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కిన 'లవ్ మి' మీదికి ఆయన ఫోకస్ మళ్లింది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చిత్రం 'రౌడీ బాయ్స్' నిరాశపరచడంతో ఆశిష్ కెరీర్‌కు ఇది చాలా కీలకం. దీన్ని హిట్ చేయడం ఆశిష్‌కే కాదు, తన బేనర్‌కు కూడా చాలా అవసరం. అందుకే రాజు ప్రమోషన్లు గట్టిగా చేసి జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాలని చూస్తున్నారు.

Tags:    
  • Dilraju 
  • Tollywood 
  • Starproducer 
  • Familystar 
  • Vijaydevarkonda 
  • Lovemeifyoudare 
  • Ashishreddy 
  • Rowdyboys 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS