అట్లీ ఆట ఇక‌ హైద‌రాబాద్ లో!

కోలీవుడ్ సంచ‌ల‌నం అట్లీ హైద‌రాబాద్ లో ల్యాండ్ అయిన సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ సినిమాకు సంబం ధించి అట్లీ హైద‌రాబాద్ రావ‌డం ఇదే తొలిసారి.;

Update: 2025-05-23 22:30 GMT

కోలీవుడ్ సంచ‌ల‌నం అట్లీ హైద‌రాబాద్ లో ల్యాండ్ అయిన సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ సినిమాకు సంబం ధించి అట్లీ హైద‌రాబాద్ రావ‌డం ఇదే తొలిసారి. ఈ కాంబినేష‌న్ లో ప్రాజెక్ట్ అనుకున్న దగ్గ‌ర నుంచి ప‌ను ల‌న్నింటిని చెన్నై నుంచి ఆప‌రేట్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు దుబాయ్ లో ప్రారంభ‌వ్వ‌గా చెన్నై టూ దుబాయ్ తిరిగాడు. ఆ ప‌నుల‌తో పాటు న్యూయార్క్ స్టూడియోల‌కు ట‌చ్ లోకి వెళ్లాడు.

హై టెక్నిక‌ల్ స్టాండ‌ర్స్డ్ సినిమా కావ‌డంతో? అక్క‌డ ప్ర‌ఖ్యాత స్టూడియోల‌తో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ డు ఏఐ టెక్నాల‌జీతో బ‌న్నీ ప్రీలుక్ ను డిజైన్ చేయిం చాడు. మొత్తం మూడు పాత్ర‌లు కావ‌డంతో? రెండు పాత్ర‌ల‌కు సంబంధించి లుక్స్ ఫైన‌ల్ అయ్యా యి. ఆ ప‌నులు ఓ కొలిక్కి రాగానే అట్లీ హైద‌రాబాద్ లో దిగాడు. మిగిలిన ప‌నులు ఇక్క‌డ నుంచి చేప‌డుతున్నాడు.

పెండింగ్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ అంతా ఇక్క‌డ నుంచే జ‌రుగుతుంద‌ని స‌మాచారం. అట్లీ టీమ్ ఓ స్టార్ హోట‌ల్ లో దిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. జూన్ లో సినిమా ప్రారంభించాల‌న్న‌ది ప్లాన్ . దీనిలో భాగంగా వీలైనంత వేగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేయాల‌ని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. డైరెక్ట‌ర్ త‌మిళీ య‌న్.. .నిర్మాతలు త‌మి ళోలు కావ‌డంతో? ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్ లో ఉంటుందా? చెన్నైలో ఉంటుందా? అన్న‌దానిపై మాత్క ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

ఈ నెల‌ఖ‌రుక‌ల్లా ఆ క్లారిటీ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. తొలి షెడ్యూల్ మాత్రం హైద‌రాబాద్ లోనే మొద‌ల వుతుంద‌ని బ‌న్నీ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి వినిపిస్తుంది. మునుప‌టి చిత్రాల‌కంటే ఈ సినిమాకు బ‌న్నీ మ‌రింతగా శ్ర‌మించాల్సి ఉంటుంద‌ని...అందుకు త‌గ్గ‌ట్టు బ‌న్నీ ప్రీపెర్ అవుతున్నాడు.

Tags:    

Similar News