రిలీజ్ వ‌ర‌కూ క‌ల్కీ చిన్న‌ది..ఆ త‌ర్వాతే పెద్ద‌ది!

ఇది చిన్న వేడుక మాత్ర‌మే. అస‌లు సిస‌లైన హ‌డావువ‌డి వచ్చె నెల నుంచి మొద‌ల‌వుతుంది

Update: 2024-05-23 05:48 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ `క‌ల్కి 2898` పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. రిలీజ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డేకొద్ది అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ప్ర‌భాస్ బ్రాండ్ తో సినిమాకి మంచి బిజినెస్ అవుతుంది. పాన్ ఇండియా స‌హా ఓవ‌ర్సీస్ మార్కెట్ లోనూ క‌ల్కీ బిజినెస్ మాములుగా లేదు. నిన్న‌టి రోజున ఆర్ ఎఫ్ సీలో ఓవేడుక నిర్వ‌హించారు.

ఇది చిన్న వేడుక మాత్ర‌మే. అస‌లు సిస‌లైన హ‌డావువ‌డి వచ్చె నెల నుంచి మొద‌ల‌వుతుంది. ఇక ఈసినిమాని అశ్వినీద‌త్ ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు. ప్రాజెక్ట్ కోసం వందల కోట్లు కేటాయించారు. ఆయ‌న కెరీర్ లో ఇదే తొలిభారీ బ‌డ్జెట్ చిత్రం కూడా. దీంతో ద‌త్ గారిని సోమ్ము.ద‌మ్ము ఉన్న నిర్మాత అంటూ తెగ పొగిడేస్తున్నారు.

భారీ కాన్సాస్ పై తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో మీడియాలోనూ అదే రేంజ్ లో హైలైట్ అవుతుంది.

`బాహ‌హుబ‌లి`..`ఆర్ ఆర్ ఆర్`...`స‌లార్` త‌ర్వాత భారీ వ‌సూళ్లు సాధించే తెలుగు సినిమా ఇదే అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు సైతం అంచ‌నా వేస్తున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లోనూ వ‌సూళ్ల విష‌యంలో సందేహ‌మే అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. భారీ ఓపెనింగ్ ల‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. పాజిటివ్ టాక్ వ‌స్తే గ‌నుక వ‌సూళ్ల సునామీ మామూలుగా ఉండ‌దు. ఇలా ఇన్ని ర‌కాల ఎక్స్ ప‌క్టేష‌న్స్ సినిమాపై ఉన్నాయి. అయితే నిన్ని రోజున అశ్వినీద‌త్ యాంక‌ర్ సుమ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు రిలీజ్ వ‌ర‌కూ చిన్న సినిమా ....రిలీజ్ త‌ర్వాత పెద్ద సినిమా అని బ‌ధులిచ్చారు.

సినిమా గురించి బ‌య‌ట ఇంత ప్రచారం జ‌రుగుతుంటే? ద‌త్ గారు రిలీజ్ కి ముందు చిన్న సినిమా అన‌డం కొంద‌రినిలో ఆలోచ‌న‌లో ప‌డేసింది. చిన్న సినిమా అని ఆయ‌న ఏ ఉద్దేశంతో అన్న‌ట్లు? ఆయ‌న మాట‌ల వెనుక ఆతర్యం ఏంటి? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. మ‌రి ఆ సంగ‌తేంటో తేలాలి. సినిమా జూన్ లో రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News