MSGలో నయన్.. BMWలో ఆషిక

సినీ సంక్రాంతి సందడి ఫుల్ జోష్ గా నడుస్తోంది. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఏకంగా ఐదు తెలుగు స్ట్రయిట్ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి.;

Update: 2026-01-15 16:37 GMT

సినీ సంక్రాంతి సందడి ఫుల్ జోష్ గా నడుస్తోంది. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఏకంగా ఐదు తెలుగు స్ట్రయిట్ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ. మాస్ మహారాజా రవితేజ లీడ్ రోల్ లో రూపొందిన ఆ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఆ సినిమా.. జనవరి 13వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయింది.

ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో ఇద్దరూ తమ యాక్టింగ్ తో అదరగొట్టారు. వామ్మో వాయ్యో పాటలో తమ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సినిమాలో ఆషిక చాలా ట్రెండీగా కనిపించి అందరినీ మెప్పించారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా, ఇప్పుడు ఆషిక ప్రశంసలు కురిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ.. యావరేజ్ రివ్యూస్ తో యావరేజ్ గా నడుస్తుండగా మేకర్స్ రీసెంట్ గా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న ఆషిక రంగనాథ్.. భీమ్స్ సిసిరోలియో వర్క్ కోసం మాట్లాడారు.

"నేను ఒక రివ్యూ లో మన శంకర వరప్రసాద్ గారు మూవీలో నయనతార గారికి ఎలివేషన్ ఇచ్చినట్లు, భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో నా ఇంట్రడక్షన్‌ కు కూడా అద్భుతమైన ఎలివేషన్ భీమ్స్ ఇచ్చారని చూశాను. చెప్పాలంటే ఆయన ఇచ్చిన కంటెస్ట్ చాలా నచ్చింది. ఇంట్రడక్షన్ మ్యూజిక్ సూపర్. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఎన్ని సార్లు చూసినా బోరింగ్ గా ఉండవు" అని ఆషిక చెప్పారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలోని ప్రతి పాటలో కూడా ఒక కొత్త ఫీల్ ఉంటుందని తెలిపారు ఆషిక. ముఖ్యంగా మెలోడీ పాటలు అయితే ప్రేక్షకులను థియేటర్‌ లోనే కాకుండా నెట్టింట కూడా ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వండర్‌ ఫుల్ పాటలు ఇచ్చిన భీమ్స్ సర్ కు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు ఆషిక రంగనాథ్.

సీనియర్ హీరో నటించిన సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. హీరోయిన్ క్యారెక్టర్‌ ను కేవలం గ్లామర్‌కే పరిమితం చేయకుండా కథలో భాగంగా చూపించారని తెలిపారు. ఆషిక రంగనాథ్ వ్యాఖ్యలతో మరోసారి సినిమా మ్యూజిక్, ప్రెజెంటేషన్ గురించి చర్చ మొదలైంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం మ్యూజిక్, ఎలివేషన్ సీన్స్ వల్ల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని సినీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా చూస్తే MSGలో నయన్, BMWలో ఆషిక అన్నట్లుగా.. హీరోయిన్ పాత్రకు ఇచ్చిన ట్రీట్‌ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌ గా మారింది.

Tags:    

Similar News