• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత చేతుల మీదుగా 'జాంబీ...

సమంత చేతుల మీదుగా 'జాంబీ రెడ్డి' ఫస్ట్ బైట్..!

By - Tupaki Desk
Update: 2020-12-04 12:42 GMT
'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ''జాంబీ రెడ్డి'' అనే వైవిధ్యమైన చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాంబీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంతో తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ బైట్ ని డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఈ ఫస్ట్ బైట్ వీడియోను రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' సినిమాలో ఆమెకు మనవడిగా కనిపించాడు. ఇప్పుడు మనవడి సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత సామ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి - యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో చివరి షెడ్యూల్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. షూటింగ్ మొత్తం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఆనంది - దక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది జాంబీ కథాంశంతో వస్తున్న మొట్ట మొదటి తెలుగు సినిమా. కర్నూల్ బ్యాగ్రౌండ్ లో వస్తున్న ఈ ఫిక్ష‌న‌ల్ జాంబీ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి స‌్క్రిప్ట్స్‌ విల్లే స్క్రీన్‌ ప్లే అందిస్తుండగా.. అనిత్‌ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ 'జోంబీ రెడ్డి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    
  • Zombie Reddy 
  • Prasanth Varma 
  • Diwali 
  • Daksha 
  • First Bite 
  • 5th December 
  • Samantha 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS