జ‌గ‌న్ ఎపిసోడ్ జ‌త చేస్తార‌ట‌!

Update: 2018-11-20 14:30 GMT
టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో బ‌యోపిక్‌ లు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ నాయకుల బ‌యోపిక్‌ లు మ‌రింత‌గా అగ్గి రాజేస్తున్నాయి. నాయ‌కుల జీవితాల్లో ఎమోష‌న్ కంటెంట్ సాధార‌ణ బ‌యోపిక్‌ ల‌తో పోలిస్తే చాలా హైలెవ‌ల్లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అందుకే ఎన్టీఆర్ - వైయ‌స్సార్ జీవితాల్ని వెండితెర‌కెక్కిస్తున్నారు అన‌గానే జ‌నాల క‌ళ్ల‌న్నీ అటువైపుకు మ‌ళ్లాయి. జ‌న‌వ‌రిలో ఎన్టీఆర్ బ‌యోపిక్ - వైయ‌స్సార్ బ‌యోపిక్ రిలీజ్‌ ల‌కు రెడీ అవుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిన‌ క‌థానాయ‌కుడు - మ‌హానాయ‌కుడు జ‌న‌వ‌రిలోనే రిలీజ్ బ‌రిలో ఉన్నాయి. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి చివ‌రి వారంలో మ‌హానాయ‌కుడు చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సేమ్ టైమ్‌ వైయ‌స్సార్ బ‌యోపిక్ `యాత్ర‌`ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ రెండు బ‌యోపిక్‌ ల కాస్టింగ్ ఎంతో ఆస‌క్తి రేకెత్తించేదే. ఎన్టీఆర్ పాత్ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌ - వైయస్సార్ పాత్ర‌లో మ‌ల‌యాళ మెగాస్టార్‌ మ‌మ్ముట్టి క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. కీల‌క పాత్ర‌ల‌కు క్రేజు ఉన్న తార‌ల్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌యి - చివ‌రి అంకంలో ఉన్నారంతా.  2019 ఎన్నిక‌ల ముందే..  మోస్ట్ అవైటెడ్ బ‌యోపిక్‌ లుగా ఈ సినిమాలు రిలీజ‌వుతుండ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

వైయ‌స్సార్ బ‌యోపిక్ టాకీ పూర్తి చేసి - ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు చేస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో అత్యంత కీల‌క‌మైన వైయ‌స్ జ‌గ‌న్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ అభిమానుల్లో సాగుతోంది. ``ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. జ‌గ‌న్ పాత్ర ఇందులో ఉండ‌దు`` అంటూ చిత్ర‌యూనిట్ నుంచి ఇదివ‌ర‌కూ స‌మాచారం అందింది. అయితే జ‌గ‌న్ అభిమానులు అందుకు స‌సేమిరా! అంటున్నార‌ట‌. వైయ‌స్ బ‌యోపిక్‌ లో జ‌గ‌న్ పాత్ర లేక‌పోతే అసంపూర్ణం అని భావిస్తున్నార‌ట‌. దీంతో జ‌గ‌న్‌ కి సంబంధించిన ఓ కీల‌క ఎపిసోడ్‌ ని చిత్రీక‌రించి సినిమాకి క‌ల‌పాల‌ని మ‌హి.వి.రాఘ‌వ్ అండ్ టీమ్ భావించార‌ని తెలుస్తోంది. అయితే జ‌గ‌న్ పాత్ర‌లో న‌టించేది ఎవ‌రు? అంటే ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను సంప్ర‌దించార‌ని - అత‌డు నో చెప్పాడ‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ ప‌తాకంపై విజ‌య్ చిల్లా - శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News