మరో ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్న యూత్ స్టార్..?
'భీష్మ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యూత్ స్టార్ నితిన్.. వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో 'చెక్'.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమాలు పూర్తి చేశాడు నితిన్. నెల రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఇదే క్రమంలో 'అంధాదున్' తెలుగులో రీమేక్ స్టార్ట్ చేసాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ''పవర్ పేట'' అనే సినిమా చేయనున్నాడు నితిన్.
'పవర్ పేట' సినిమాలో నితిన్ మూడు గెటప్స్ లో కనిపించబోతున్నాడని.. అందులో ఒకటి వృద్ధుడి పాత్ర అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. జూన్ 11న 'అంధాదున్' తెలుగు రీమేక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నాడు. దీనిని బట్టి చూస్తే 'పవర్ పేట' షూటింగ్ మే జూన్ నెలలో స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇకపోతే 'రౌడీ ఫెలో' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య.. నితిన్ తో ఇంతకముందు 'చల్ మోహన్ రంగా' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.