'ఇరుముడి'.. రవితేజతో అందమైన కావేరి
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’పై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది.;
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’పై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అసలు ఎవరు ఊహించని విధంగా అయ్యప్ప మాల టైటిల్ తోనే ఈ సినిమా డిఫరెంట్ ఏమోషన్ తో రానున్నట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్‌లో ఇది 77వ ప్రాజెక్ట్. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇప్పటికే విడుదలైన రవితేజ అయ్యప్ప మాల లుక్ ప్రేక్షకుల్లో ఒక కొత్త రకమైన క్యూరియాసిటీని పెంచగా, తాజాగా మహా శివరాత్రి సందర్భంగా చిత్రబృందం మరో క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించుతూ.. ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే, ‘ఇరుముడి’ ఒక పక్కా లోకల్ ఎమోషనల్ అండ్ క్యూట్ డ్రామా అని అర్థమవుతోంది.
రవితేజ చాలా రోజులకు తన పాత మాస్ లుక్ వదిలి, కాస్త రగ్గడ్ అండ్ నేచురల్ మేకోవర్‌లో కనిపిస్తుండటం ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ ఇస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ ‘కావేరి’ అనే హుందాతనమైన పాత్రలో కనిపించబోతున్నారు. విడుదలైన పోస్టర్‌లో రవితేజ ఆమె చెంపపై ముద్దు పెడుతుండగా, ఆమె చిరునవ్వుతో ఉన్న దృశ్యం వీరిద్దరి మధ్య ఉన్న అందమైన కెమిస్ట్రీని హైలెట్ చేస్తోంది. సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని, నవ్వుతున్న ప్రియా.. ఒక బాధ్యతాయుతమైన భార్యగా, తల్లిగా ఈ సినిమాలో తన నటనతో మెప్పించబోతున్నారని తెలుస్తోంది.
శివ నిర్వాణ తన సినిమాల్లో ఎమోషన్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. ఈ ‘ఇరుముడి’లో కూడా ఆయన ఒక హార్ట్ టచింగ్ తండ్రి కూతుళ్ల కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటిస్తుండగా, సాయి కుమార్, అజయ్ ఘోష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే హ్యూమన్ ఎమోషన్లు ఈ సినిమాలో మెయిన్ హైలైట్ కాబోతున్నాయట.
సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా బలంగా కనిపిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ విడుదల తేదీ గురించి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ‘మజిలి’ లాంటి సినిమాలతో మెప్పించిన శివ నిర్వాణ, రవితేజను ఒక కొత్త యాంగిల్‌లో ఎలా చూపిస్తారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ‘ఇరుముడి’ సినిమాతో రవితేజ మళ్ళీ తన ఫామ్ లోకి రావడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. చూడాలి మరి రాబోయే అప్డేట్స్ ఇంకెంత క్యూరియసిటీని క్రియేట్ చేస్తుందో చూడాలి.