టాప్ స్టోరి: త‌మ్ముళ్లొస్తున్నారు జాగ్ర‌త్త‌!!

Update: 2019-06-02 14:46 GMT
అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ న‌ట‌వార‌సుల వెల్లువ క‌నిపిస్తోంది. స్టార్ల వార‌సులు బ‌రిలో దిగి అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. ఇటీవ‌లే బాలీవుడ్ లో ప‌లువురు న‌ట‌వార‌సుల సినిమాలు రిలీజ‌య్యాయి. మ‌రికొంద‌రు అదృష్టం ప‌రీక్షించుకునేందుక రెడీ అవుతున్నారు. ఇక టాలీవుడ్ లోనూ న‌ట‌వార‌సుల వెల్లువ‌కు కొద‌వేమీ లేదు. `వార‌స‌త్వంలో ఇది డిఫ‌రెంట్ గురూ!` అనేలా హీరోల త‌మ్ముళ్లు.. క‌థానాయిక‌ల సోద‌రులు హీరోలు అవ్వ‌డం అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అన్న ఐడెంటిటీని తెలివిగా త‌మ్ముళ్ల‌కు ఆపాదిస్తూ వీళ్లు హీరోలుగా ల‌క్ చెక్ చేసుకోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

మెగా కాంపౌండ్ నుంచి సాయిధర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఉప్పెన అనేది టైటిల్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఒక మ‌త్స్య‌కారుని క‌థాంశం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ జాల‌రి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అన్న‌లానే మాస్ అప్పీల్ ఉన్న ఈ యంగ్ హీరో ఏ మేర‌కు మెప్పిస్తాడోనంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అలాగే రౌడీగా పాపుల‌రై ప‌రిశ్ర‌మ లో అగ్ర‌ప‌థంలోకి దూసుకుపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ `దొర‌సాని` చిత్రంతో హీరో అవుతున్నాడు. కె. వి. ఆర్ మహేంద్ర‌ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ద‌ర్శ‌కుడికి ఇదే తొలి సినిమా. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది.

నిర్మాత బెల్లంకొండ సురేష్ వార‌సుడిగా ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీ‌నివాస్ వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ లేక‌పోయినా కెరియ‌ర్ బండిని తెలివిగా లాగేస్తున్నాడు. త్వ‌ర‌లోనే సాయి శ్రీ‌నివాస్ త‌మ్ముడు గ‌ణేష్ హీరో అవుతున్నాడు. ఇంకా టైటిల్ ఖారారు చేయ‌ని ఈ చిత్రంతో ఫ‌ణి అనే న‌వ‌త‌రం ట్యాలెంట్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. గ‌ణేష్ ఇప్ప‌టికే సొంత బ్యాన‌ర్లో కొన్ని సినిమాల‌కు నిర్మాత‌గా వ్వ‌వ‌హ‌రించాడు. వీళ్ల‌తో పాటే ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు హీరోలు- ద‌ర్శ‌క‌నిర్మాత‌ల పుత్ర ర‌త్నాల సోద‌రులు హీరోలు కాబోతున్నార‌ని తెలుస్తోంది. పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఆల్మోస్ట్ తెలుగు క‌థానాయిక‌గా ఇక్క‌డే సెటిలైంది కాబ‌ట్టి ఇప్పుడు త‌న సోద‌రుడు అమ‌న్ ప్రీత్ ని టాలీవుడ్ లో పెద్ద హీరోని చేయాల‌ని ఉవ్విళ్లూరుతోంది. అమ‌న్ ఎంట్రీ సినిమా ప్రామిస్సింగ్ గా ఉంటుంద‌ట‌. దాస‌రి లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే మొద‌లైంది.


Tags:    

Similar News