ఆ స్టార్ హీరోపై సమంత ఆసక్తికర కామెంట్స్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత.. ఒకప్పుడు పలువురు స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.;

Update: 2025-12-20 07:19 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత.. ఒకప్పుడు పలువురు స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. విడిపోయిన తర్వాత అటు సమంత , ఇటు నాగచైతన్య ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. సమంత ఈ ఏడాది భూత శుద్ధ పద్ధతిలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది.

రాజ్ తో వివాహం జరిగిన తర్వాత నాలుగు రోజులకే ఆమె కొత్త సినిమా షూటింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్ బ్యానర్ పై నిర్మిస్తున్న రెండో చిత్రం మా ఇంటి బంగారం.. ఇందులో సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. 1980 నాటి కథతో రాబోతున్న ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వగా.. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత గతంలో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక స్టార్ హీరోపై ఆమె చేసిన కీలక వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి బడా హీరోలతో కలిసి నటించిన సమంత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేసింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది అనే సినిమాలో నటించింది సమంత. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కి జోడిగా నటించడమే కాకుండా ఇందులో తన అద్భుతమైన నటనతో, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా సమంత, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో సమంతని పవన్ ఆశీర్వదిస్తూ కనిపించారు. దీని గురించి గతంలో సమంత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. సమంత మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ నా గురువు. స్విట్జర్లాండ్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు సరదాగా తీసిన ఫోటో అది. ఆయన నటుడు కాకపోయినా కనీసం నాకు గురువుగా అయినా ఉండమని కోరేదాన్ని" అంటూ తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. "ఆయన ఎవరినైనా తిట్టాలంటే కూడా చాలా మర్యాదగా తిట్టేవారు. అందుకే ఆయన ఈ స్టేజికి వచ్చారు" అంటూ సమంత తెలిపింది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను తన గురువు అంటూ సంబోధించడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News