పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మైండ్ సెట్!
అయితే ఇది నిన్నటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది. మన స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. అలా చేస్తే వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ని, ఫేమ్‌ని సొంతం చేసుకొవచ్చని ప్లాన్ చేసుకుంటున్నారు.;
పాన్ ఇండియా.. టాలీవుడ్‌లో ఏ హీరోని కదిలించినా వినిపిస్తున్న పేరిది. పాన్ ఇండియా సినిమాలతో తన మార్కెట్ స్థాయిని పెంచుకోవాలని, హీరోగా తన క్రేజ్‌ని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందు కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనుకాడటం లేదు. అయితే ఇది నిన్నటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది. మన స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. అలా చేస్తే వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ని, ఫేమ్‌ని సొంతం చేసుకొవచ్చని ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇందు కోసం యాక్టింగ్‌ని మాత్రమే నమ్ముకోకుండా కంటెంట్ డిమాండ్‌ని బట్టి, క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి అందులోకి పరకాయ ప్రవేశం చేయడం కోసం పూర్తి స్థాయిలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. తమ గెటప్, డైలాగ్ డెలివరీ, మ్యాడ్యులేషన్ విషయాల్లో పూర్తి స్థాయి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అందరిని షాక్‌కు గురి చేస్తున్నారు. స్టార్ హీరోలు మహేష్, ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని వరకు హీరోలంతా ఇదే ఫార్ములాని పాటిస్తూ ఔరా అనిపిస్తున్నారు.
ఈ హీరోల్లో క్యారెక్టర్‌కు, కెంటెంట్‌కు తగ్గట్టుగా కొత్త అవతారంలోకి మారడానికి టార్చ్ బేరర్‌లా ముందుకొచ్చిన హీరో ప్రభాస్. బాహుబలి`తో ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ప్రభాస్ ప్రతి సినిమాకు సరికొత్త అవతారంలోకి మారిపోతూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. `ది రాజా సాబ్` మూవీతో వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ డైరెక్షన్‌లో రూపొందుతున్న`స్పిరిట్` మూవీలో తొలి సారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపించి కనువిందు చేయబోతున్నాడు.
`రంగస్థలం`లో చిట్టిబాబుగా డీ గ్లామ్ క్యారెక్టర్‌లో కనిపించి ఆశ్చర్యపరిచిన రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూపొందుతున్న `పెద్ది`లోనూ అదే తరహా మాసీవ్ క్యారెక్టర్‌లో సరికొత్త అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇదే తరహాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ మూవీ కోసం సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు.
`డ్రాగన్` పేరుని పరిశీలిస్తున్న ఈ మూవీ కోసం భారీగా బరువు తగ్గిన ఎన్టీఆర్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నాడు. స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ కోసం `పుష్ప`లో మాస్ అవతారం ఎంత్తడం అది బ్లాక్ బస్టర్ కావడం తెలిసిందే. పార్ట్ 1కు మించి పార్ట్ 2 `పుష్ప 2`లో మరింత మాస్ అవతారం ఎత్తిన బన్నీ ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా సరికొత్త రికార్డుల్ని సెట్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం అట్లీ తో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న బన్నీ మరోసారి సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు.
వీరేనా కొత్తగా టై చేసేది అంటు `దసరా`తో రంగంలోకి దిగిన నాని ఊర మాస్ క్యారెక్టర్‌లో కనిపించి అదిగొట్టిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో ఇప్పుడు రెండు జడలు ధరించి ఎవరూ ఊహించిన మాస్ అవతార్‌లో `ది ప్యారడైజ్` కోసం నాని సరికొత్త అవతారంలో కనిపించి షాక్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు బెంగాలీ, స్పానిష్ భాషల్లోనూ మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. యాక్టింగ్ ని మాత్రమే ప్రధానంగా చూసుకోకుండా పాన్ వరల్డ్ మైండ్ పెట్‌తో మన హీరోలు సినిమా సినిమాకు సరికొత్త అవతారం ఎత్తడానికి రెడీ అవుతుండటం విశేషం.