• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ మాత్రం దానికే అలగాలా?

ఈ మాత్రం దానికే అలగాలా?

By - Tupaki Desk
Update: 2018-05-30 09:30 GMT
ఒక సినిమా హిట్ కొట్టాలన్నా.. మంచి సినిమాగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నా అది ఒక్కళ్ల వల్ల అయ్యపని కాదు. సినిమా యూనిట్ మొత్తం మనసు పెట్టి పనిచేస్తేనే సక్సెస్ ఫుల్ రిజల్ట్ కనిపిస్తుంది. కానీ సినిమా ఎలా ఆడినా తనకే పేరు రావాలని హీరోలు ఆశ పడుతుంటారు. ఒక్కోసారి హీరోకంటే సినిమాలో నటించిన మిగతావాళ్లకు పేరు రావచ్చు. అందుకని సినిమానే గాలికొదిలేయడం అంటే అది కచ్చితంగా హీరో తప్పని చెప్పాలి.

ఈమధ్య కుటుంబ సమేత చిత్రమొకటి వచ్చింది. మరీ డిజాస్టర్ కాకపోయినా ఫర్వాలేదని అనిపించుకుంది. సినిమా యూనిట్ మూవీని ప్రమోట్ చేసేందుకు సక్సెస్ మీట్ పెట్టింది. దీనికి ఆ సినిమాలో నటించిన యంగ్ హీరో ముఖం చాటేశాడు. సినిమా రిలీజ్ కు ముందు తెగ ప్రమోట్ చేసిన ఆ హీరో రిలీజ్ తరవాత దాని ఊసెత్తడమే మానేశాడు. దీనికి కారణమేంటని ఆరా తీస్తే ఆ సినిమాలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ అదరగొట్టారని పేరొచ్చింది. తనకు పేరు రాలేదన్న ఉక్రోషంతో ఆ హీరో మొదటి నుంచి ప్రమోషన్స్ ను పట్టించుకోవడం మానేశాడు.

ఆ హీరో ఇలా చేయడం మొదటిసారేమీ కాదు. ఇంతకుముందు కూడా తాను నటించిన ఓ సినిమా ప్రమోట్ చేయకుండా వదిలేశాడు. తనతో కలిసి నటించిన యాక్టర్ తో తేడా కొట్టడంతో మొత్తం మూవీనే బహిష్కరించినంత పనిచేశాడు. ఎవరి మీద కోపమో సినిమా మీద చూపిస్తా ఎలా మహాశయా?   


Tags:    
  • Young Hero 
  • Movie promotions 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS