హిమాల‌యాల్లో యంగ్ హీరో డేర్ డెవిల్ అడ్వెంచ‌ర్

Update: 2020-11-08 04:15 GMT
క‌రోనా వైర‌స్ చాలా మంది జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసింది. చాలా మందిని ఇంటికే ప‌రిమితం చేసింది. సెల‌బ్రిటీల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు. నిత్యం ఏదో ఒక చోటికి షూటింగుల హ‌డావుడి అంటూ వెళ్లాల్సిన‌ సెల‌బ్రిటీలు గ‌త ఏడెనిమిది నెల‌లుగా ఇంటికే లాకైపోయారు. చిన్న చిన్న‌గా క‌రోనా ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌డుతున్న వేళ షూటింగ్ లు మొద‌లుకావ‌డంతో స్టార్స్ విహార యాత్ర‌ల‌కు వెళుతున్నారు.

త‌మ‌కు న‌చ్చిన ప్లేస్ ‌ల‌కు వెళుతున్నారు. అయితే అంతా రిలాక్స్ కోసం వెకేష‌న్ కి వెళుతుంటే యంగ్ హీరో న‌వ‌దీప్ మాత్రం రిస్కీ ప్లేస్ ‌కి వెళ్ల‌డం ప‌లువురు సెల‌బ్రిటీస్ ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. న‌వ‌దీప్ అంద‌రికి భిన్నంగా సాహ‌సోపేత‌మైన హిమాల‌యాల్లో రోడ్ ట్రిప్ ‌కి వెళ్ల‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. త‌న గ్రూప్ ఫ్రెండ్స్ తో క‌లిసి న‌వ‌దీప్ హిమాల‌యాల‌కు రోడ్ ట్రిప్ వెళ్లాడు. ఈ ప్ర‌యాణాన్ని త‌ను అనుక్ష‌ణం ఎంజాయ్ చేస్తున్నార‌ట‌.

ఈ ట్రిప్ ‌కి సంబంధించిన వీడియోల‌ని.. ఫొటోల‌ని న‌వ‌దీప్ ఇన్ స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. క‌రోనా మహమ్మారి సమయంలో ప్రయాణించడం సరికొత్త అనుభవం అయితే ఇది నాకు జీవితాన్ని మార్చే అనుభవం అని అనుకుంటున్నాను. మేము మైనస్ ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉన్నాము. ఇది నీటి ప్రవాహానికి అత్యంత ఎత్తైన ప్రాంతం.  సైట్ లో వండిన తాజా ఆహారాన్ని తినడం.. కనీస స్థాయిలో జీవించడం.. చేస్తున్నాం. నాకు ఇది చాలా అవసరమైన విరామం `అని నవదీప్ వీడియోలో తెలిపారు. స్పష్టమైన కారణాల వల్ల ప్రజలు ఇప్పుడు పర్యాటకులను భయపెడుతున్నారు  సోలో ప్రయాణాలకు బదులుగా సమూహాలతో ప్రయాణించడం మంచిది. ప్రయాణానికి ముందు నేను మూడుసార్లు కోవిడ్ -19 పరీక్ష చేయించుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు అది తప్పనిసరి`అని నవదీప్ పేర్కొన్నారు.
Tags:    

Similar News