• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్చ్‌.. మహేష్‌ హీరోయిన్...

ప్చ్‌.. మహేష్‌ హీరోయిన్ ను అడగలే!!

By - Tupaki Desk
Update: 2015-12-25 04:26 GMT
ఒక్కసారిగా తమ పాపులార్టీ దెబ్బతినేస్తోందని అనుకున్నారా? లేకపోతే ఇలాంటి వాటిపై క్లారిటీ ఇవ్వకపోతే అనవసరంగా ఒక హీరోయిన్‌ కు బీభత్సమైన పాపులార్టీ వచ్చేస్తోంది అనుకున్నారా? మ్యాటర్‌ ఏదైనా కూడా యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ మాత్రం.. చాలా రోజుల తరువాత రూమర్ల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడూ కనీసం ఫోన్‌ కాల్‌ కు కూడా స్పందించని ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ టీమ్‌.. ఇప్పుడు మహేష్‌ హీరోయిన్‌ కృతి సేనన్‌ గురించి మాత్రం నానా హంగామా చేస్తోంది.

కట్‌ చేస్తే.. సల్మాన్‌ ఖాన్‌ తో యశ్‌ రాజ్‌ సంస్థ తీస్తున్న ''సుల్తాన్‌'' సినిమా కోసం ఇంకా హీరోయిన్‌ దొరకలేదు. కరీనా కపూర్‌ నుండి పరిణీతి చోప్రా వరకు చాలా పేర్లే వినిపించాయి కాని.. ఒక్కరు కూడా ఈ సినిమాకు ఓకే చెప్పలేదు. పైగా.. మమ్మల్ని అస్సలు ఎవ్వరూ ఎప్రోచ్‌ కానే కాలేదు అంటూ కొట్టిపారేశారు కూడా. ఇకపోతే సడన్‌ గా ఈ సినిమాలో కృతి సేనన్‌ హీరోయిన్‌ అంటూ టాకొచ్చేసింది. ఇంతలోనే మరో రూమర్‌. యశ్ రాజ్‌ పెట్టిన కండీషన్లు ఇష్టం లేక కృతి నో చెప్పిందని. ఒక ప్రముఖ వార్తాపత్రిక పూర్తి వివరాలతో ఈ మ్యాటర్‌ను బ్యానర్‌ వార్తగా ప్రచురించింది. సాధారణంగా ఇలాంటి రూమర్లకు వై.ఆర్.ఎఫ్‌ పెద్దగా స్పందించదు. కాని ఇప్పుడు రూటు మార్చింది.

''మేం అస్సలు  ఏ సినిమా కోసం కూడా కృతి సేనన్‌ ను సంప్రదించలేదు. సుల్తాన్‌ కోసం అస్సలు అడనగనేలేదు. రూమర్లు ప్రచారం చేయకండి. నమ్మకండి'' అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది యశ్ రాజ్‌. ఏదో గుమ్మడికాయల దొంగలెవరు అంటూ భుజాలు తడుముకున్నట్లుంది. మహేష్‌ సరసన 1-నేనొక్కడినే సినిమాతో డెబ్యూ చేసిన కృతి, తరువాత నాగ చైతన్య సరసన దోచెయ్‌ సినిమాలో కూడా నటించిన సంగతి విదితమే.
Tags:    
  • Yashraj Films 
  • Kriti Sanon 
  • Telugu NEws 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS