త్రివిక్రమ్ జోక్యం యువ దర్శకుడి క్రియేటివిటీని దెబ్బతీస్తుందా..?

Update: 2021-07-01 13:30 GMT
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ తో మూడు సినిమాలను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్.. ఆయన నటించే ఇతర సినిమాల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. పవన్ చిత్రాలకు మాట సాయం చేయడమే కకుబడా.. ఆయన నిర్మించిన సినిమాలకు కథను కూడా అందించాడు. ప్రస్తుతం పవన్ - రానా కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ ఇస్తున్నాడు.

తెలుగు నేటివిటీకి సెన్సిబిలిటీస్ తగ్గట్లు మలయాళ కథలో పలు మార్పులు చేర్పులు చేశాడు త్రివిక్రమ్. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని పెడుతున్నారు. ఈ క్రమంలో 'ఏకే' రీమేక్ సెట్స్ లో కూడా త్రివిక్రమ్ యాక్టీవ్ గా ఉంటున్నారని.. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించనున్న షెడ్యూల్స్ ను దగ్గరుండి చూసుకొనున్నారట. ఇదే కనుక నిజమైతే త్రివిక్రమ్ జోక్యం 'ఏకే' రీమేక్ దర్శకుడు సాగర్ కె.చంద్ర పనిని దెబ్బతీసే అవకాశం ఉందని అంటున్నారు.

#PSPKRana కథ ప్రకారం ఇందులో ఒకరు హీరో ఒకరు విలన్ అని కాకుండా ఇద్దరి పాత్రలు బ్యాలన్స్ గా ఉంటాయి. అందుకే హీరోల మధ్య ఈగో వల్ల వచ్చే వైరం కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయడానికి స్క్రీన్ ప్లే-డైలాగ్స్ త్రివిక్రమ్ రాయిస్తున్నామని నిర్మాత ఇది వరకే చెప్పాడు. సీనియర్ దర్శకుడి సపోర్ట్ తో సాగర్ విజువల్ గా బాగా తీయగలడనే నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. త్రివిక్రమ్ అనుభవం సాగర్ కు హెల్ప్ అయినప్పటికీ.. మరీ ఎక్కువ ఇన్వాల్వ్ మెంట్ ఉంటే మాత్రం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రియేటివిటీకి ఇబ్బందే అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి కంటెంట్ బేస్డ్ సినిమాతో దర్శకుడిగా సాగర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ - రానా లతో చేస్తున్న సినిమా ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.
Tags:    

Similar News