రంగమ్మత్త అమ్మగా చేసేంత సాహసం చేసేనా?

Update: 2020-07-17 10:30 GMT
జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఒక వైపు బుల్లి తెర మరో వైపు వెండి తెరను సమానంగా బ్యాలన్స్‌ చేస్తూ వస్తుంది. బుల్లి తెరపై పలు షోలతో బిజీ బిజీగా ఉన్నా కూడా సినిమాల్లో నటించేందుకు వెనుకాడటం లేదు. తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న ప్రతి సినిమాకు కమిట్‌ అవుతూనే ఉంది. అప్పటి వరకు నటించిన పాత్రలు ఒక ఎత్తు అయితే రంగమ్మత్త పాత్ర ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. రంగస్థలం తర్వాత అనసూయ సినీ కెరీర్‌ ఒక్కసారిగా స్పీడ్‌ అందుకుంది.

విభిన్నమైన పాత్రలతో దర్శకులు ఆమెను సంప్రదిస్తున్నారు. ఇటీవల సుశాంత్‌ అశ్విన్‌ హీరోగా రూపొందుతున్న ఒక చిత్రంలో హీరో తల్లి పాత్రకు గాను అనసూయను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. మొదట ఆ పాత్రను ఇంద్రజతో చేయించాలని మేకర్స్‌ భావించారు. అయితే ఇంద్రజ ఇప్పట్లో హైదరాబాద్‌ రాలేను అంటూ చెప్పడంతో వారు అనసూయను సంప్రదించారట. హీరోలకు అమ్మ పాత్రలో ఇప్పటి వరకు అనసూయ చేయలేదు. కాని పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా సుశాంత్‌ కు అమ్మగా నటించేందుకు ఒప్పుకుందనే ప్రచారం జరుగుతోంది.

మరో వైపు కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో టీవీ షో ల షూటింగ్స్‌ కు కూడా హాజరు కాను అంటూ ప్రకటించిన అనసూయ ఇప్పుడు సుశాంత్‌ సినిమాలో నటించేందుకు ఎలా ఒప్పుకుంటుందని.. 35 ఏళ్ల వయసులో అనసూయ హీరో తల్లి పాత్రలకు ఒప్పుకోవడం అంటే సాహస నిర్ణయమని.. అంతటి సాహస నిర్ణయాన్ని అనసూయ తీసుకుంటుంది అంటే నమ్మలేక పోతున్నాం అని.. ఇవన్ని పుకార్లే కావచ్చు అంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది అనసూయ నోరు విప్పితే కాని క్లారిటీ రాదు.
Tags:    

Similar News