టాలీవుడ్ రెండుగా చీలిపోయే పరిస్థితులు వస్తాయా..?

Update: 2020-11-17 23:30 GMT
మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం విడిపోయినప్పటికీ కొన్నాళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించారు. అయితే అప్ప‌ట్లో తెలుగు స్టార్ హీరోలైన నందమూరి తారకరామారావు - అక్కినేని నాగేశ్వరరావు లు సూప‌ర్ హీరోలుగా పేరు తెచ్చుకోవ‌డంతో తెలుగు చిత్ర సీమ సెపరేట్ గా మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్ కు త‌రలి వ‌చ్చింది. అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. అయినప్పటికీ టాలీవుడ్ మాత్రం ఒకటిగానే కొనసాగుతోంది. కాకపోతే తెలంగాణకు చెందిన సినీ ప్రముఖులు ఎక్కువగా లేకపోవడంతోనే ఇంకా చిత్ర పరిశ్రమ ఒకటిగా కలిసి ఉందనే కామెంట్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. అలానే ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోలు వరుస సక్సెస్ లు అందుకుని స్టార్ హీరోలుగా గుర్తింపు పొందితే అల‌నాటి ప‌రిస్థితులే మళ్ళీ పునరావృతం కావచ్చనే కామెంట్స్ ఈ మధ్య సినీ జనాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ - సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ - మాస్ కా దాస్ విశ్వక్ సేన్ - కార్తికేయ‌ - ఆనంద్ దేవ‌ర‌కొండ‌ - నిఖిల్ సిద్దార్థ్ వంటి హీరోలు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. వీరందరూ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమా చేసుకుంటూ వస్తున్నారు. నితిన్ ప్రస్తుతం 'రంగ్ దే' 'చెక్' 'అంధాదూన్' రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలానే 'పవర్ పేట' అనే సినిమా కూడా లైన్లో పెట్టాడు. అప్పటికే 'భీష్మ' సక్సెస్ తో జోష్ మీదున్న నితిన్.. ఇప్పుడు ఈ నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయితే స్టార్ హీరోల సరసన చేరే అవకాశం ఉంది. అలానే 'అర్జున్ రెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ 'ఫైటర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. త్వరలోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరో స్టేటస్ దక్కించుకోనున్నాడు. ఇలా ప‌క్కా ఈ ప్రాంతానికి చెందిన హీరోల శ్రేణికి వరుస స‌క్సెస్ లు వచ్చి క్రేజ్ తెచ్చుకుంటే మ‌ళ్లీ అల‌నాటి ప‌రిస్థితే రావ‌చ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ మరియు వైజాగ్ కేంద్రంగా రెండు రాష్ట్రాల్లో పని చేస్తుందనే కామెంట్స్ చేసేవారు కూడా లేకపోలేదు. మరి రాబోయే రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News