సందీప్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చేనా...?
''అర్జున్ రెడ్డి'' సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఒక్క సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్. దీంతో సందీప్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడ్డాయి. అయితే సందీప్ మాత్రం టాలీవుడ్ హీరోలతో సినిమా కమిట్ అవకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. 'అర్జున్ రెడ్డి' సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ''కబీర్ సింగ్'' పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ అందరూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంటే సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రాలేదు.
కాగా అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సందీప్ వంగా ఓ సినిమా ప్లాన్ చేసాడని వార్తలు వచ్చాయి. దీనికి సంబందించి వీరి మధ్య చర్చలు కూడా జరిగాయని.. మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకున్నారు. అయితే అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఆ తర్వాత రామ్ చరణ్ తో సందీప్ చర్చలు జరుపుతున్నాడని.. తదుపరి ప్రాజెక్ట్ చరణ్ తో ఉండే అవకాశం ఉందని న్యూస్ వచ్చింది. ఈ క్రమంలో సందీప్ మళ్ళీ బాలీవుడ్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడని.. రణబీర్ కపూర్ లేదా రణవీర్ సింగ్ లతో 'డెవిల్' అనే టైటిల్ తో సినిమా ఉంటుందన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదు. ఈ నేపథ్యంలో సందీప్ వంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక కథ చెప్పాడని.. ప్రభాస్ కూడా పాజిటివ్ గా స్పందించాడని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
అయితే సందీప్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. మహేష్.. పరశురామ్ మరియు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు కమిట్ అయ్యారు. చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' తో పాటు 'ఆచార్య'లో నటించనున్నాడు. ప్రభాస్ 'రాధే శ్యామ్' తో పాటు నాగ్ అశ్విన్ తో ఓ మూవీని అనౌన్స్ చేసారు. సందీప్ డైరెక్ట్ చేయబోయే హీరోలు అంటూ వచ్చిన వారందరూ వచ్చే రెండేళ్ల వరకు బిజీగాగడపనున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో సస్పెన్స్ అలానే కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్స్ రాసుకుంటున్న సందీప్ రెడ్డి మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి త్వరలోనే సందీప్ తదుపరి సినిమా ఎవరితో అనేది క్లారిటీ వస్తుందేమో చూడాలి.