డైరెక్టర్లకు రైటర్లకు పని పెట్టిన యాంగ్రీ యంగ్ మెన్!
ఓడలు బల్లవుతాయి..బల్లు ఓడలవుతాయి అంటారు పెద్దలు. ఇది జీవితంలో సహజం. ఎప్పుడు ఎవరి స్థార్ తిరుగుతుందో..ఎవరి స్థానం ప్రధాన స్థాయికి చేరుకుంటుందో ఇక్కడ ఎవరూ చెప్పలేరు.;
ఓడలు బల్లవుతాయి..బల్లు ఓడలవుతాయి అంటారు పెద్దలు. ఇది జీవితంలో సహజం. ఎప్పుడు ఎవరి స్థార్ తిరుగుతుందో..ఎవరి స్థానం ప్రధాన స్థాయికి చేరుకుంటుందో ఇక్కడ ఎవరూ చెప్పలేరు. కాలాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి. వాటిని అంతే హుందాతో స్వీకరించిన వారు విజయవంతంగా కెరీర్‌లో దూసుకుపోతూ ముందుకు సాగుతుంటారు. ఆ మార్పులు స్వీకరించని వారు అక్కడే ఉండిపోతారు. కాల క్రమేణా తెరమరుగవుతుంటారు. ఇదే విషయాన్ని బాగా ఒంటబట్టించుకున్నట్టున్నాడు యాంగ్రీ యంగ్ మెన్‌గా పేరు తెచ్చుకున్న డా. రాజశేఖర్.
యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్..ఒక దశలో పవర్ ఫుల్ కాప్ స్టోరీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో. అంకుశం, ఆహుతి, ఆవేశం వంటి పవర్‌ఫుల్ స్టోరీస్‌తో ప్రేక్షకుల్లో పోలీస్ అంటే ఇలా ఉండాలని ఓ ట్రేడ్ మార్క్‌ని సెట చేసి హీరోగా ప్రత్యేకతను చాటుకున్న డా. రాజశేఖర్ ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోవడంతో తడబడ్డారు. ఏజ్ ఫ్యాక్టర్, మారిన పరిస్థితులు, ప్రేక్షకుల అభిరుచి కారణంగా ఆయన హీరోగా రేసులో వెనకబడ్డారు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించిన ఆయన కొత్త తరహా పాత్రలతో సెండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఒకటి రెండు సినిమాలు అంగీకరించినా వారు రాజశేఖర్ వంటిప్రొటెన్షియల్ ఉన్న స్టార్‌ని ఉపయోగించుకోవడంతో, ఆయన క్యారెక్టర్‌ని పవర్ ఫుల్‌గా డిజైన్ చేయడంలో ఫెయిలయ్యారు. దాంతో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రశ్నార్థకంలో పడింది. కోవిడ్ కారణంగా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొని చావు దాకా వెళ్లొచ్చిన ఆయనకు ఇప్పటికి సరైన సినిమా దొరికింది అదే `బైకర్`. శర్వానంద్ హీరోగా నటించిన బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో డా. రాజశేఖర్ ఆయన ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్‌లో నటించి మెప్పించారు.
ఈ శుక్రవారం విడుదలైన `బైకర్` ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా రాజశేఖర్‌కు సరికొత్త ఉత్సాహాన్ని అందించి ఆయనతో మరింత జోష్‌ని నింపింది. మరిన్ని మంచి చిత్రాలకు ఊతమిచ్చి సరికొత్త చర్చకు తెరలేపింది. ఒక దశలో హీరోగా ఉన్న రియల్ స్టార్ శ్రీహరి కథకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి సినిమాలకు ప్రధాన బలంగా నిలిచారు. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా!`, మగధీర, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం వంటి సినిమాల్లో ఆయన పోషించిన క్యారెక్టర్స్ ఆయా సినిమాలకు ప్రధాన బలంగా నిలవడం తెలిసిందే.
ఇప్పుడు డా. రాజశేఖర్‌కు అలాంటి స్కోప్ లభించబోతోంది. శ్రీహరి ఉంటే ఎలాంటి పెద్ద తరహా కీలక పాత్రలని క్రియేట్ చేస్తూ యంగ్ హీరోలతో కథలని సిద్ధం చేసే వారో ఇప్పుడు కూడా డా. రాజశేఖర్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయనకున్న గౌరవాన్ని ఎక్కడా తగ్గించని స్థాయిలో పాత్రలని క్రియేట్ చేసే అవకాశం వచ్చింది. ఈ విషయంలో దర్శకులు, రైటర్లు తమ కథల్లో ప్రాముఖ్యత ఉన్న క్యారెక్టర్లని రాజశేఖర్ కోసం క్రియేట్ చేస్తే టాలీవుడ్ తెరపై మరిన్ని మంచి చిత్రాలు వచ్చే అవకాశం ఉందనే టాక్ సర్వత్నా వినిపిస్తోంది. మరి డైరెక్టర్లు, రైటర్లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని డా. రాజశేఖర్‌ని సరైన పంథాలో ఉపయోగించుకుంటారో వేచి చూడాల్సిందే.