ఎన్టీఆర్ కోసం రంగంలోకి `ధురంధ‌ర్‌` న‌టుడు!

ఎక్క‌డ చూసినా ధురంధ‌ర్ ఫీవ‌ర్ క‌నిపిస్తుండ‌టంతో ఇప్పుడు దీనిపైనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా చ‌ర్చ జ‌రుగుతోంది.;

Update: 2026-04-03 22:30 GMT

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సంచ‌ల‌న మూవీ `ధురంధ‌ర్ 2`. ఆదిత్య‌ధ‌ర్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించి మార్చి 19న విడుద‌లైన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌నాలు సృష్టిస్తూ స‌రికొత్త చ‌రిత్ర దిశ‌గా ప‌రుగులు పెడుతోంది. సినిమా విడుద‌లై రెండు వారాలు కావ‌స్తున్నా బాక్సాఫీస్ వ‌ద్ద దీని జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే రూ.1500 కోట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ సినిమా రానున్న రోజుల్లో మ‌రిన్ని రికార్డుల్ని తుడిచి పెట్ట‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఎక్క‌డ చూసినా ధురంధ‌ర్ ఫీవ‌ర్ క‌నిపిస్తుండ‌టంతో ఇప్పుడు దీనిపైనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. `ధురంధ‌ర్‌` ఫీవ‌ర్ ఇప్పుడు టాలీవుడ్‌ని కూడా తాకుతోంది. ఈ సినిమా క్రేజ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుండ‌టంతో మ‌న వాళ్లు కూడా ఇందులో న‌టించిన వారిపై క‌న్నేస్తున్నారు. `ధురంధ‌ర్ 2` ఫీవ‌ర్‌ని త‌మ సినీమాల‌కు మ‌ళ్లించుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడ‌ర్ శ్రీ‌రాని బ‌లోచ్‌గా న‌టించిన బిమ‌ల్ ఓబెరాయ్‌ని రంగంలోకి దించేస్తున్నారు.

ఓ పోడ్ కాస్ట్‌లో ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. `ధురంధ‌ర్ 1` చూసి తెలుగు సినిమా కోసం నాకు ఫోన్ చేశారు. వెంట‌నే నేను ఓకే చెప్పాను. ఫోన్ చేసింది డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. ఆయ‌న కేజీఎఫ్, కేజీఎఫ్ 2, స‌లార్ సినిమాలు చేసిన డైరెక్ట‌ర్ ఆయ‌న‌. చాలా గౌర‌వంగా ఆయ‌న మాట్లాడారు. సినిమాలో నా క్యారెక్ట్ గురించి చెప్పారు. ఆ క్యారెక్ట‌ర్ నాకు ఎంత‌గానో న‌చ్చింది. ధురంధ‌ర్‌లో మిమ్మ‌ల్ని చూసిన‌ప్పుడే అనుకున్నాను. నెక్స్ట్ వీక్ హైద‌రాబాద్ వ‌స్తారా? అని అడిగారు.

అంతే కాకుండా లుక్ టెస్ట్ ఉంటుందని చెప్పారు. వెంట‌నే హైద‌రాబాద్ వెళ్లాను. లుక్ టెస్ట్ జ‌రిగింది. ప్ర‌శాంత్ నీల్ చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఈ సినిమా పేరు `డ్రాగ‌న్‌`. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరో. ఇందులో చాలా చాలా కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాను. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ నాకు ఫోన్ చేయ‌డ‌మే కాకుండా నేను `ధురంధ‌ర్‌`లో పోషించిన క్యారెక్ట‌ర్ గురించి మాట్లాడు న‌న్ను అభినందించారు. అభినందించ‌డ‌మే కాకుండా త‌న సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట్‌ని ఇచ్చారు. ఇంత‌కు మించిన ప్ర‌శంస ఇంకేముంటుంది.

అంటూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డిస్తూనే `ఎన్టీఆర్ సినిమా టైటిల్ `డ్రాగ‌న్‌` అని ఫిక్స్ చేసిన‌ట్టుగా ఫుల్ క్లారిటీ ఇచ్చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే టొవినో థామ‌స్ వ‌దులుకున్న క్యారెక్ట‌ర్‌నే ప్ర‌శాంత్ నీల్ `ధురంధ‌ర్‌` న‌టుడికి ఆఫ‌ర్ చేశారా? అనే చ‌ర్చ మొద‌లైంది. రీసెంట్‌గా టొవినో థామ‌స్ ...ఎన్టీఆర్ మూవీలో తాను న‌టించ‌డం లేద‌ని, ఒక్క సినిమాకు ఏడాది పాటు డేట్స్ ఇవ్వ‌లేకే సినిమా వ‌దులుకున్నాన‌ని చెప్ప‌డం తెలిసిందే. ఇక ఈ మూవీని ఇండో -చైనా బోర్డ‌ర్ నేప‌థ్యంలో సాగే ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీతో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ప‌వ‌ర్‌ఫుల్ ఇంట‌ర్నేష‌న‌ల్ డాన్‌గా క‌నిపిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, రుక్మిణీ వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Tags:    

Similar News