బన్నీ - అట్లీ మూవీ షూటింగ్‌పై వార్ ఎఫెక్ట్!
ఇదిలా ఉంటే బన్నీ మూవీపై వార్ ఎఫెక్ట్ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కీలక ఘట్టాల షూటింగ్‌ని దర్శకుడు అట్లీ దుబాయ్ అండ్ అబుదాబిల్లో ప్లాన్ చేశాడట.;
అమెరికా -ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల రోజులుగా జరగుతున్న వార్ కారణంగా ఇందన కొరతతో పాటు గ్యాస్ కొరత ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అంతే కాకుండా విమాన ఇందనంపై కూడా దాని ప్రభావం పడటంతో రేట్లు తారా స్థాయికి చేరుకుని సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కమర్షియల్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లిపోవడం, భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు హోటళ్లు కూడా మూతపడటం తెలిసిందే.
ఇలా ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం తీవ్రస్థాయిలో ప్రపంచ జీవనాన్ని ప్రభావితం చేస్తూ తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్ జరుపుతున్న వార్ ఎఫెక్ట్ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీకి కూడా తాకినట్టుగా చెబుతున్నారు. `పుష్ప2`తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఆ క్రేజ్‌ని కొనసాగిస్తూ భారీ సినిమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్‌లని లైన్‌లో పెట్టిన బన్నీ రెండింటిని పట్టాలెక్కించాడు.
ఈ రెండింటిలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ స్థాయి మూవీకి శ్రీకారం చుట్టడం తెలిసిందే. సూపర్ హీరో తరహా క్యారెక్టర్‌లో హాలీవుడ్ ఎవెంజర్స్ తరహా స్టోరీతో అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ మూవీస్‌ని ఏ మాత్రం తగ్గకుండా అట్లీ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. బన్నీ 22వ సినిమాగా రూపొందుతున్నఈ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ కోసం ఫ్యాన్స్‌తో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ లేదా టీజర్‌ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఇదిలా ఉంటే బన్నీ మూవీపై వార్ ఎఫెక్ట్ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కీలక ఘట్టాల షూటింగ్‌ని దర్శకుడు అట్లీ దుబాయ్ అండ్ అబుదాబిల్లో ప్లాన్ చేశాడట. ప్రస్తుతం ముంబైలో వేసిన భారీ సెట్‌లలో షూటింగ్ చేస్తున్న అట్లీ కీలక సన్నివేశాలని దుబాయ్, అబుదాబిల్లో తీయాలనుకున్నాడట. దీని కోసం ముందే ప్లాన్ చేసుకున్నాడట. కానీ ఇరాన్ అరబ్ కంట్రీస్‌పై కూడా క్షిపణుల వర్షం కురిపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో బన్నీ మూవీ షూటింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
వార్ ఎఫెక్ట్ కారణంగా దుబాయ్, అబుదాబిల్లో షూటింగ్‌ని రద్దు చేసుకున్న అట్లీ ఇందు కోసం కొత్త లొకేషన్‌లని రీసెంట్‌గా ఫైనల్ చేశాడని, మే నుంచి నెక్ట్స్ షెడ్యూల్‌ని కొత్తగా ఎంపిక చేసిన లొకేషన్‌లలో స్టార్ట్ చేయబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ లేదా టీజర్‌ని రిలీజ్ చేయాలని ప్లాన్ టీమ్ చేసింది. అయితే అది జరిగేలా కనిపించడం లేదు. కారణం వీఎఫ్ ఎక్స్ ఇంకా పూర్తి కాలేదని, ఆ కారణంగానే అట్లీ గ్లింప్స్‌ని రిలీజ్ చేయాలనే ఆలోచనని విరమించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మరొకటి కూడా ఉందట. అర కొర వీఎఫ్ ఎక్స్‌తో ఏదో ఒకటి రిలీజ్ చేసేస్తే నెట్టింట ట్రోల్‌కి గురికావడం పక్కా. ఈ మధ్య చాలా వరకు సినిమాలు ఈ విధంగా ట్రోల్‌కు గురయ్యాయి. ఆ పరిస్థితి తమ సినిమాకు రాకూడదనే అట్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.