విడుదలకు సిద్ధమైన 'స్టార్ హీరో' కొత్తమూవీ చిక్కుల్లో పడనుందా..??
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ విషయం గ్రహించే చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదివరకే విడుదలకు సిద్దమైన సినిమాలను డిజిటల్ మీడియం ద్వారా విడుదల చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 'పొన్ మగల్ వందాల్' అనే తమిళ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసాడు హీరో సూర్య. కానీ అప్పటికే తమిళ థియేటర్ల సంఘాలు సూర్య పై పైర్ అయ్యాయని విషయం తెలిసిందే.
ఎందుకంటే నేరుగా థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ చేసిన సినిమాలను ఓటీటీలో ఎలా విడుదల చేస్తారని.. థియేటర్లు తెరుచుకునే వరకూ విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయకూడదని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ వారి మాట కాదని రిలీజ్ చేస్తే సూర్య హీరోగా చేసే సినిమాలన్నింటి పై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. సూర్య సినిమాలే కాకుండా, నిర్మాతగా వ్యవహరించే సినిమాలు థియేటర్లలో ఆడకుండా చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే సూర్య థియేటర్ సంఘాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెజాన్ ప్రైమ్ లో సినిమా విడుదల చేసి హిట్ అందుకున్నాడు.
తన నిర్ణయాన్ని మానుకోవాలని సంఘాలు ఎంత ఒత్తిడి తెచ్చినా మరి సూర్య ఏ ధైర్యంతో ఇలా చేసాడో అర్థం కావడంలేదని అంటున్నారు. అయితే ప్రస్తుతం తమిళ థియేటర్ల సంఘాలు సూర్య పై ఇంకా కోపం తగ్గించుకోలేదని వార్తలొస్తున్నాయి. మరి అదేగనక నిజమైతే సూర్య హీరోగా తెరకెక్కిన సురరై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) మూవీ చిక్కుల్లో పడినట్లే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ థియేటర్ సంఘాల నుండి మాత్రం ఈ విషయం పై ఎలాంటి స్పందన లేదు. ఇంకా సూర్య ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కంప్రెమైజ్ అయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి సినిమా విడుదల సమయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో..!