ఫోటో స్టోరి: అల్లుకుపోయిన సన్నజాజి తీగలు
తాజాగా విడుదలైన ఫోటో స్టోరీలో బానిట గ్లామర్ ఎలివేషన్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.;
సోషల్ మీడియాలలో గ్లామరస్ తారకల సందడి ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. తాజాగా బానిటా సంధు, ప్రముఖ గ్లోబల్ ఇన్‌ఫ్లూయెన్సర్ దీపా బుల్లర్ ఖోస్లా కలిసి చేసిన ఫోటోషూట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. వీరిద్దరూ ఒక అంతర్జాతీయ కమర్షియల్ బ్రాండ్ ప్రచారం కోసం జతకట్టారు. పింక్ కలర్ మిరుమిట్లు గొలిపే దుస్తులలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఇచ్చిన పోజులు ప్రస్తుతం కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నాయి. సన్నజాజి తీగల్లాంటి భామల నడుము సొగసులు చూస్తుంటే అభిమానులు మైమరచిపోతున్నారు. ఈ ఫోటోఫ్రేమ్ లో ఎంతో సన్నిహితంగా కలిసిపోయి ఫోజులిచ్చిన అందాల భామలపైనే యువతరం కళ్లన్నీ.
ముఖ్యంగా బానిటా సంధు విషయానికి వస్తే.. ఈ బ్రిటిష్-ఇండియన్ నటి తనదైన స్టైల్‌తో గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా విడుదలైన ఫోటో స్టోరీలో బానిట గ్లామర్ ఎలివేషన్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం కమర్షియల్ ప్రొడక్ట్ ప్రచారం కోసమే అయినా కానీ... ఈ ఇద్దరు అందగత్తెలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం విజువల్ ట్రీట్‌లా ఉందంటూ చర్చ సాగుతోంది. తారా లోకంలో వీరిద్దరికీ భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
సినిమా కెరీర్ పరంగా బానిటా సంధు ప్రయాణం కొంత ఒడిదుడుకులతో సాగుతోంది. బాలీవుడ్ చిత్రం `అక్టోబర్` ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ భామ.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెట్టింది. టాలీవుడ్ సెన్సేషన్ `అర్జున్ రెడ్డి` తమిళ రీమేక్ `ఆదిత్య వర్మ`లో కథానాయికగా నటించి ఆకట్టుకుంది. చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ సరసన ఆమె చేసిన ఈ ప్రయత్నం గ్లామర్ పరంగా మెప్పించినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
సినిమాల్లో సరైన బ్రేక్ రాకపోయినప్పటికీ, మోడలింగ్ మరియు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ విషయంలో బానిటా ఎప్పుడూ టాప్ గేర్‌లోనే ఉంటోంది. ఇప్పుడు దీపా బుల్లర్ ఖోస్లాతో కలిసి చేసిన ఈ స్వీట్ అబ్సెషన్ 2026 క్యాంపెయిన్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ఫోటోషూట్‌లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఆ పింక్ కలర్ అవుట్‌ఫిట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ ప్రచారం ద్వారా బానిటాకు మళ్ళీ వెండితెరపై భారీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి బానిటా సంధు- దీపా బుల్లర్ ఖోస్లా తమ అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. కేవలం కమర్షియల్ యాడ్ కోసమే కాకుండా వీరిద్దరి గ్లామర్ ప్రజెంటేషన్ ఒక ఆర్ట్ లాగా ఉందంటూ ఫోటోగ్రాఫర్ల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. కెరీర్ లో వరుస విజయాలు దక్కకపోయినా ఇలాంటి గ్లామర్ షోస్ ద్వారా బానిటా తన ఫాలోయింగ్‌ను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. మునుముందు ఈ భామకు దక్షిణాదిన మరిన్ని వైవిధ్యమైన పాత్రలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.