రాజమౌళి రికార్డును ప్రశాంత్ నీల్ బ్రేక్ చేస్తాడా..?
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయిన దక్షిణాది చిత్రాల్లో 'కేజీఎఫ్' ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ - దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. యశ్ కి శాండిల్ వుడ్ లో ఉన్న ఫాలోయింగ్ తో ఈ సినిమా 'కన్నడ బహుబలి'గా నిలిచింది. అయితే ఇతర భాషల్లో యశ్ గురించి ఎవ్వరికీ పెద్దగా తెలీదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'కేజీఎఫ్'చాప్టర్-1 సినిమా బాగుంది అనే మౌత్ టాక్ తో సూపర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలో దీనికి కొనసాగింపుగా వస్తున్న 'కేజీఎఫ్-చాప్టర్ 2' చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
అయితే సౌత్ లో ఇప్పటి వరకు దర్శకధీరుడు రాజమౌళి తప్పిస్తే సీక్వెల్ ని ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద హిట్ చేసిన దర్శకులు ఎవ్వరూ లేరు. రాజమౌళి తీసిన 'బాహుబలి' కంటే 'బాహుబలి 2' సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు 'కేజీఎఫ్ 2' ని కూడా ముందు పార్ట్ కంటే పెద్ద హిట్ చేయడానికి ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సీక్వెల్ తో ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రాజమౌళి రికార్డును బ్రేక్ చేస్తాడేమో చూడాలి.
కాగా, జనవరి 8న హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు 'కేజీఎఫ్ 2' చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ - రవీనా టాండన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రవీ బాస్రుర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో కన్నడ తెలుగు తమిళ మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.