నిజజీవితంలో రాజకీయ పాత్ర పోషిస్తా - షకీలా
షకీలా.. ఒక పేరు కాదు, బ్రాండ్! తొంభైల్లో ఎంతో మంది కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ శృంగార తార.. పలు భాషల్లో దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా.. ఆమె బయోపిక్ ప్రేక్షకులను అలరించబోతోంది. ‘షకీలా’ పేరుతోనే తెరకెక్కిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో షకీలా పాత్రను నటి ఏస్తర్ పోషించారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమైంది.
నేను రాసిన చరిత్ర..
ఈ సందర్భంగా నటి షకీలా మాట్లాడుతూ.. తాను రాసుకున్న తన జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందినట్లు తెలిపారు. అయితే.. తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఈ మూవీలో చూపించట్లేదని చెప్పారు. చిత్రానికి ఎంత మేర అవసరమో.. అంత వరకే చూపించబోతున్నట్లు తెలిపారు.
నా తప్పులు కూడా..
ఒక వ్యక్తి జీవించి ఉండగానే.. తన జీవిత చరిత్ర సినిమాగా రూపొందడం ఆసక్తికరమైన విషయమన్నారు. ఈ చిత్రంలో తాను చేసిన తప్పులను కూడా చూపినట్లు తెలిపారు. నా తప్పులు రాబోయే నటీనటులకు, ఇతర మహిళలకు ఒక మంచి పాఠంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
నా వాళ్లే మోసం చేశారు..
తన సొంత సోదరి కారణంగానే చాలా మోసపోయానని చెప్పారు షకీల. అయినప్పటికీ.. తన కుటుంబాన్ని ఇప్పటికీ తానే పోషిస్తున్నానని చెప్పారు. ఇక, ‘రాజకీయాల్లోకి వస్తారా?’ అని చాలా మంది అడుగుతున్నారన్న ఈ సెక్సీ క్వీన్.. తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో ఉన్నట్టు చెప్పారు. ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా.. ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు షకీలా.