పోలీస్‌గా సంయుక్త మీనన్… ది బ్లాక్ గోల్డ్ లో మాస్ అవతార్!

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల దిశగా మరో ఆసక్తికరమైన అడుగు పడింది. సంయుక్త మీన‌న్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హై ఓక్టేన్ యాక్షన్ డ్రామా ది బ్లాక్ గోల్డ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-04-27 09:41 GMT

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల దిశగా మరో ఆసక్తికరమైన అడుగు పడింది. సంయుక్త మీన‌న్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హై ఓక్టేన్ యాక్షన్ డ్రామా ది బ్లాక్ గోల్డ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవితంలో చోటుచేసుకున్న షాకింగ్ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. కేవలం 60 రోజుల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేయడం టీమ్ ప్లాన్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.




 


ఇటీవల చిత్రబృందం రిలీజ్ చేసిన సంయుక్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించిన తీరు నిజ జీవిత పోలీస్ అధికారిని గుర్తు చేసేలా ఉందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆమె లుక్‌లో ఉన్న సీరియస్‌నెస్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ప్రెజెన్స్ ఇన్న‌వీ కలిపి ఒక పవర్‌ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మేకింగ్ వీడియోలో కూడా ఈ పాత్ర కోసం తీసుకున్న కష్టాన్ని స్పష్టంగా చూపించారు. ప్రతి సీన్‌లో రియాలిటీకి దగ్గరగా ఉండేలా డైరెక్ట‌ర్ స్పెష‌ల్ కేర్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కథ తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న బొగ్గు సిండికేట్ అక్రమ కార్యకలాపాల చుట్టూ తిరుగుతుంది. బెల్లంపల్లి, కాగజ్‌నగర్ వంటి రియల్ కోల్ మైన్ ప్రాంతాల్లో షూటింగ్ జరపడం ద్వారా కథకు సహజత్వం తీసుకొచ్చారు. అలాగే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్‌లో కీలక సన్నివేశాలు షూట్ చేశారు. కథలో సంయుక్త పోషిస్తున్న నిజాయితీ గల పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర చుట్టూనే మెయిన్ క‌థంతా న‌డుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చ‌ట్టాన్ని నిలబెట్టాల‌నే ఆమె పోరాటం ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవనుంది.

టెక్నికల్‌గా కూడా ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కినట్టు సమాచారం. యాక్షన్ సన్నివేశాల కోసం ఒకేసారి ఐదు కెమెరాలతో షూటింగ్ చేయడం ద్వారా గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్‌ను అందించారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇంత భారీ స్థాయిలో యాక్షన్ ఎలిమెంట్స్ చూపించడం అరుదుగా కనిపించే విషయం. ఈ విషయంలో ది బ్లాక్ గోల్డ్ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్, రీరికార్డింగ్ దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశ‌ముంది. కంటెంట్, స్కేల్, సంయుక్త మీన‌న్ పవర్‌ఫుల్ పాత్ర.. ఇవ‌న్నీ కలిపి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త చర్చలకు దారితీయనుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News