కేవలం 6 సినిమాలతోనే టాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్!
ముఖ్యంగా ఆమె నటించిన ఆరు సినిమాల్లో ఐదు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించగా, ఒక్క సినిమా మాత్రమే ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.;
టాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసిన హీరోయిన్‌లలో ఒకరిలా కనిపించినా, వాస్తవానికి కేవలం ఆరు సినిమాలతోనే అద్భుతమైన ముద్ర వేసిన హీరోయిన్స్ లో సోనాలి బింద్రే ఒకరు. 2001 నుంచి 2004 మధ్య కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఆమె చేసిన ఈ సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా ఆమె నటించిన ఆరు సినిమాల్లో ఐదు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించగా, ఒక్క సినిమా మాత్రమే ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.
ఒక్క సినిమా మినహా అన్నీ హిట్లే!
మురారి, ఇంద్ర, మన్మథుడు, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ లేదా భారీ హిట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా 2002లో వరుసగా రిలీజైన ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు సినిమాలు సోనాలి కెరీర్‌ను టాలీవుడ్‌లో పీక్ స్థాయికి తీసుకెళ్లాయి. స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు సరసన ఆమె చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ లిస్ట్‌లో ఒక్క నిరాశ కలిగించిన సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ B. గోపాల్ కాంబినేషన్ ఉండటం, దానికి తోడు ఆర్తి అగర్వాల్, సోనాలి బేంద్రే వంటి స్టార్ కాస్ట్ ఉండటం సినిమాపై హైప్‌ను పెంచింది. కానీ రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్, ముఖ్యంగా సోషల్ మీడియాలో తర్వాత కాలంలో విపరీతంగా ట్రోల్‌కు గురైన ట్రైన్ రివర్సింగ్ సీన్, సినిమాకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అంతేకాదు, రిలీజ్ ముందు ఫైనాన్షియల్ ఇష్యూలు, నిర్మాతపై ఉన్న అప్పులు కారణంగా ప్రింట్లు ఆపివేయబడినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికవరీ సాధించలేకపోయింది.
ప్రేమికుల రోజుకు భారీ ఆదరణ
ఇక తమిళంలో రూపొందిన కదలార్ దినం సినిమా తెలుగులో ప్రేమికుల రోజుగా డబ్ అయి రిలీజైనప్పటికీ, అది స్ట్రైట్ తెలుగు సినిమా తరహాలోనే ప్రేక్షకాదరణ పొందడం సోనాలి క్రేజ్‌కు నిదర్శనం. ఇదిలా ఉంటే, హిందీలో దాదాపు 25కి పైగా సినిమాలు చేసిన ఆమె, టాలీవుడ్‌లో కెరీర్ బలంగా స్థిరపడుతున్న సమయంలోనే వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రత్యేకంగా 2004లో శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజైన టైమ్ కు సోనాలి ప్రెగ్నెంట్ కావడం, కుటుంబ జీవితంపై దృష్టి సారించాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె ఒక్కసారిగా సినిమాలకు గుడ్‌బై చెప్పారు. ఇదే సమయంలో ఆమె కెరీర్ పీక్‌లో ఉండటం విశేషం. సాధారణంగా హీరోయిన్లు కెరీర్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ సోనాలి మాత్రం టాప్ ఫామ్‌లో ఉన్నప్పుడే సినిమాలను వదిలేయడం ఆమె నిర్ణయానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. మొత్తంగా చూస్తే, కేవలం ఆరు సినిమాలతోనే టాలీవుడ్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోయే స్థానాన్ని సంపాదించడం సోనాలి బింద్రే స్పెషాలిటీ. హిట్ రేషియో, స్టార్ హీరోలతో చేసిన ప్రాజెక్టులు, తక్కువ కాలంలో సాధించిన క్రేజ్.. ఇవన్నీ కలిసి ఆమెను టాలీవుడ్‌లో ఓ స్పెషల్ చాప్టర్‌గా నిలబెట్టాయి.