గాయపడిన సింహం పై హైప్ పెంచేసిన దిల్ రాజు
ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఈ సినిమాకు సెకండ్ హీరో అనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.;
అమెరికా డ్రీమ్ చుట్టూ తిరిగే వేలాది యూత్ ఆశల్ని ఒకేసారి కదిలించే సబ్జెక్ట్‌తో వస్తున్న సినిమా గాయపడ్డ సింహం. ట్రైలర్ రిలీజ్‌తోనే ఈ సినిమా మామూలు డ్రామా కాదనే సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఈ సినిమాకు సెకండ్ హీరో అనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజు చేసిన ఈ కామెంట్ కేవలం ప్రమోషనల్ స్టేట్‌మెంట్ మాత్రమేనా లేక కథలో నిజంగానే ఆయన పాత్ర కీలకంగా నిలుస్తుందా అనే ఆసక్తి పెరుగుతుంది. ట్రంప్ హయాంలో అమలైన స్ట్రిక్ట్ డిపోర్టేషన్ పాలసీలే ఈ కథకు బేస్‌గా నిలుస్తున్నాయన్న టాక్, సినిమాను మరింత రియలిస్టిక్ జోన్‌లో నిలబెడుతోంది.
డిపోర్టేషన్ అనే సెన్సిటివ్ టాపిక్‌ను టచ్ చేస్తూ, అమెరికాలో సెటిల్ అవ్వాలనే కలలతో వెళ్లిన ఇండియన్స్ ఎదుర్కొన్న వాస్తవ సమస్యలను ఈ సినిమా ప్రతిబింబించబోతుందనే అంచనాలున్నాయి. వీసా ఇష్యూలు, సడెన్ గా మారిన పాలసీలు, ఫ్యామిలీల నుంచి దూరంగా జీవించే ఒత్తిడి.. ఇవన్నీ డ్రీమ్ vs రియాలిటీ అనే కఠినమైన కాన్ఫ్లిక్ట్‌ను సృష్టిస్తాయి. ఈ రియల్ ఎమోషన్‌ను డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ ఎలాంటి ట్రీట్‌మెంట్‌తో ప్రెజెంట్ చేశారనేది కీలకం. ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాల ప్రకారం, ఒక వ్యక్తి జీవితం ఎలా ఒక్క పాలసీ మార్పుతో తారుమారవుతుందో చూపిస్తూ, వ్యక్తిగత స్థాయిలోనే కాక సామూహికంగా కూడా ఈ సమస్య ఎంత ప్రభావం చూపిందో హైలైట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక యూత్ డ్రీమ్స్ బ్రేక్‌డౌన్ యాంగిల్ ఈ సినిమాకు ప్రధాన బలం కావొచ్చు. ప్రస్తుతం కూడా యూఎస్ఏ సెటిల్‌మెంట్ కోసం పరుగులు తీస్తున్న యువతకు ఈ కథ చాలా దగ్గరగా అనిపించే అవకాశముంది. కుటుంబాల ఆశలు, విదేశాల్లో నిలదొక్కుకోవాలనే ఒత్తిడి, మధ్యలో వచ్చే అనుకోని అడ్డంకులు.. ఈ మూడు అంశాల చుట్టూ ఎమోషన్ బలంగా నడుస్తుందని టాక్. ముఖ్యంగా పేరెంట్స్ యాంగిల్ లో చూస్తే, పిల్లలు విదేశాలకు వెళ్లడం అంటే గర్వంతో పాటు భయం కూడా ఉంటుంది. ఆ ఎమోషన్స్ ను సినిమా ఎంత లోతుగా టచ్ చేస్తుందనేది కీలక అంశం.
అయితే, ఇంత హెవీ సబ్జెక్ట్‌ను పూర్తిగా సీరియస్‌గా చూపిస్తే కమర్షియల్ ఎంగేజ్‌మెంట్ తగ్గే అవకాశం ఉంది. అందుకే డైరెక్టర్ డార్క్ హ్యూమర్ టచ్‌తో కథను చెప్పే ప్రయత్నం చేసినట్టనిపిస్తుంది. ఎమోషన్ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కథను లైట్‌గా మార్చడమే కాకుండా ఆడియన్ ను ఎంగేజ్ చేసే అవకాశముంది. ఇదే సమయంలో శ్రీ విష్ణు చేసిన ఎక్స్టెండెడ్ క్యామియో, అలాగే సెకండ్ హాఫ్‌లో వచ్చే స్టార్ రిఫరెన్స్‌లు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.
ప్రమోషన్ పరంగా కూడా గాయపడ్డ సింహం టీమ్ స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ట్రైలర్‌లోనే కంటెంట్ హింట్స్ ఇస్తూనే, డిబేట్ క్రియేట్ చేసే స్టేట్‌మెంట్స్‌తో బజ్ పెంచారు. మే 1న రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా, ఓపెనింగ్స్ విషయంలో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది చూడాలి.