#మహేష్27 కు ఆ హీరోయిన్ నెగెటివ్ సెంటిమెంట్?

Update: 2020-03-30 16:01 GMT
ఇండస్ట్రీలో చాలా సెంటిమెంట్లు రాజ్యమేలుతుంటాయి. పాజిటివ్ సెంటిమెంట్లే కాదు.. ఎన్నో నెగెటివ్ సెంటిమెంట్లు కూడా ఉంటాయి. #మహేష్27 సినిమాకు కీర్తి సురేష్ ను హీరోయిన్ గా పరిశీలిస్తున్నారనే వార్త బయటకు రావడంతో ఓ నెగెటివ్ సెంటిమెంట్ పై తీవ్రంగా చర్చ  సాగుతోంది.  అదేంటంటే కీర్తి సురేష్ నటించిన స్టార్ హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి.

ధనుష్ తో 'తొడరి'(తెలుగులో 'రైల్') నటిస్తే అది అడ్రెస్ లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' ఫలితం అందరికీ తెలిసిందే.  తమిళ హీరో విక్రమ్ తో 'సామి స్క్వేర్' చేస్తే అది అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కీర్తి నటించిన స్టార్ హీరో సినిమాల్లో విజయం సాధించింది ఒక్క 'సర్కార్' మాత్రమే. ఈ సినిమా తప్ప మిగతా అన్నీ డిజాస్టర్లే.  దీంతో కీర్తి నటించిన స్టార్ హీరోల సినిమాలకు నెగెటివ్ సెంటిమెంట్ తప్పదని ఓ టాక్ వినిపిస్తోంది.  మహేష్ బాబుకు చాలా విషయాల్లో సెంటిమెంట్స్ ఉన్నాయని.. ఈ విషయం తెలిస్తే నో చెప్పే అవకాశం తీసిపారేయలేమని అంటున్నారు

ఇదిలా ఉంటే మహేష్  కు జోడీగా ఎక్కువ యాక్టింగ్ స్కిల్స్ ఉండే భామలు బ్యాలెన్స్ అవ్వరని కూడా ఒక టాక్ ఉంది. ఒకవేళ అలాంటి జోడీ సెట్ చేసినా 'సరిలేరు నీకెవ్వరు' లో రష్మిక పాత్ర తరహాలో మహేష్ మాట్లాడితే చాలు మీదపడిపోయే పాత్రలు సెట్ చేయాల్సి వస్తుందని అంటున్నారు.  మరి పరశురామ్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడో లేదో మరి.


Tags:    

Similar News