స్టార్ డైరెక్టర్ మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా..?
యూఎస్ లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి సెన్సిబిలిటీకి తగ్గట్టుగా కంటెంట్ అందిస్తే.. భారీ వసూళ్లు గ్యారంటీ. టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించే సినిమాలకు యుఎస్ఏలో మంచి ఆదరణ ఉంటుంది.
కొరటాల సినిమాలన్నీ క్లాస్ అప్రోచ్ తో ఉండే కమర్షియల్ ఎంటర్టైన్స్. వీటికి యూఏస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ప్రభాస్ తో చేసిన 'మిర్చి' మూవీ 600k డాలర్లకు పైగా వసూలు చేయగా.. దర్శకుడి రెండో సినిమా 'శ్రీమంతుడు' 2.8 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇదే క్రమంలో కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' చిత్రం $1.8 మిలియన్లు కలెక్ట్ చేయగా.. 'భరత్ అనే నేను' మూవీ 3.4 మిలియన్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో 'భరత్ అనే నేను' సినిమా యూఎస్ లో నాన్-బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది.
అమెరికాలో ఇలాంటి బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ ఉన్న కొరటాల శివ.. ఇప్పుడు 'ఆచార్య' సినిమాతో అక్కడ దారుణమైన ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని ప్రీవియస్ రికార్డులేవీ USA మార్కెట్ లో ఈ సినిమా థియేట్రికల్ రన్ కు సహాయపడలేదని అర్థం అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ''ఆచార్య''. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో.. ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
'ఆచార్య' సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యే సమయానికి యూఎస్ లో 1 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి - చరణ్ వంటి ఇద్దరు స్టార్స్ కలిసి చేసిన చిత్రానికి ఇవి షాకింగ్ నంబర్స్ అనే చెప్పాలి.
అలానే యూఏస్ లో మంచి రికార్డ్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కొరటాల శివకు 'ఆచార్య' ఎదురు దెబ్బ అనే అనుకోవాలి. ప్రభాస్ - మహేష్ బాబు - ఎన్టీఆర్ లతో బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు.. ఇప్పుడు చిరు - చరణ్ లతో ప్లాప్ అందుకున్నారు.
గతంలో 'దూకుడు' 'బాద్ షా' వంటి విజయాలతో యూఎస్ లో మంచి ఊపు మీదున్న దర్శకుడు శ్రీనువైట్ల.. రామ్ చరణ్ తో చేసిన 'బ్రూస్ లీ' సినిమా తర్వాత మళ్లీ మరో హిట్ అందుకోలేకపోయారు. ఇప్పుడు చరణ్ భాగమైన 'ఆచార్య' సినిమాతో కొరటాల శివ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. మరి తదుపరి చిత్రంతో దర్శకుడు మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి.
కొరటాల నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. #NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రం వచ్చే నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. 'జనతా గ్యారేజ్' తర్వాత వీరి కాంబోలో రాబోయే సినిమా కావడం.. RRR తర్వాత తారక్ చేస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ ఆసక్తి ఎక్కువైంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదొక పాన్ ఇండియా మూవీ. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న NTR30 ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని వివరాలు ప్రకటించబడతాయి.